నోటిఫికేషన్స్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)... కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌)(2), 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 19 May 2022 00:22 IST

యూపీఎస్సీ- సీడీఎస్‌ ఎగ్జామ్‌ (2), 2022

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)... కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌)(2), 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
* కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (2), 2022
మొత్తం ఖాళీలు: 339 సంస్థల వారీగా ఖాళీలు: ఇండియన్‌ మిలటరీ అకాడమీ, దేహ్రాదూన్‌-100, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమళ- 22, ఏర్‌ఫోర్స్‌ అకాడమీ, హైదరాబాద్‌-32, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నై-169, ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ (నాన్‌ టెక్నికల్‌)-16 అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 07. పరీక్ష తేది: 2022, సెప్టెంబరు 04.
వెబ్‌సైట్‌:
www.upsc.gov.in/


యూపీఎస్సీ-ఎన్‌డీఏ &  ఎన్‌ఏ (2) ఎగ్జామ్‌, 2022

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. 150వ కోర్సు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), 112వ ఇండియన్‌ నేవల్‌ అకాడమీ కోర్సుల్లో(ఎన్‌ఏ) ప్రవేశానికి అవివాహిత పురుష/ మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 400 (ఎన్‌డీఏ-370, నేవల్‌ అకాడమీ-30) అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. వయసు: 2004 జనవరి 02 - 2007 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 07.
పరీక్ష తేది: 2022, సెప్టెంబరు 04.
వెబ్‌సైట్‌:
www.upsc.gov.in/


ఉద్యోగాలు
ఎస్‌ఎస్‌సీ-దిల్లీ పోలీస్‌ ఎగ్జామ్‌ 2022

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) దిల్లీ పోలీస్‌ ఎగ్జామినేషన్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)
మొత్తం ఖాళీలు: 835 (మేల్‌-559, ఫిమేల్‌-276) అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, టైపింగ్‌ స్కిల్స్‌. వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ అండ్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 16. వెబ్‌సైట్‌:
https://ssc.nic.in/


హెచ్‌యూఆర్‌ఎల్‌లో 390 పోస్టులు

ఐఓసీఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఎఫ్‌సీఐఎల్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 390 పోస్టులు: జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్లు, ఇంజినీర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టోర్‌ అసిస్టెంట్లు తదితరాలు. విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, స్టోర్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఏ/ బీఎస్సీ/ బీకాం ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 24. వెబ్‌సైట్‌:
www.hurl.net.in/


ప్రవేశాలు
ఏపీ అగ్రి పాలిసెట్‌ -2022

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి పాలిసెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య విభాగాలకు చెందిన డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2022 మే నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరైనవారు, ఇంటర్మీడియట్‌ ఫెయిలైన/మధ్యలో ఆపేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: పాలిసెట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరితేది: 2022, జూన్‌ 01. అగ్రిపాలిసెట్‌-2022 పరీక్ష తేది: 2022, జులై 01. వెబ్‌సైట్‌:
https://angrau.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని