Updated : 23 May 2022 06:27 IST

తెలంగాణలో 225 డ్రైవర్‌ ఆపరేటర్లు

హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) డిజాస్టర్‌ రెస్పాన్స్, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగాల్లో డ్రైవర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

డ్రైవర్‌ ఆపరేటర్లు (డిజాస్టర్‌ రెస్పాన్స్, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగం)

మొత్తం ఖాళీలు: 225 అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత (లేదా) పదో తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ మెకానిక్‌ డీజిల్‌/ ఫిట్టర్‌ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. హెచ్‌ఎంవీ లైసెన్స్‌తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ మెజర్‌మెంట్స్, డ్రైవింగ్‌ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 26. 

వెబ్‌సైట్‌: www.tslprb.in/


ఐఏఎఫ్‌-ఏఎఫ్‌క్యాట్‌ (2), 2022

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) పర్మనెంట్, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్‌ (2) 2022 ప్రకటన విడుదలైంది. 

 ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ఏఎఫ్‌క్యాట్‌-2/2022)

మొత్తం ఖాళీలు: వెల్లడించాల్సి ఉంది విభాగాలు: ఏఎఫ్‌ క్యాట్‌ ఎంట్రీ, మెటీయోరాలజీ ఎంట్రీ, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జూన్‌ 01. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30. 

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/


ఎఈఈఎస్‌లో 205 పోస్టులు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అటమిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏఈఈఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న 30 అటమిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌/ జూనియర్‌ కాలేజీల్లో కింది టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 205 పోస్టులు-ఖాళీలు: పీజీటీ-15, టీజీటీ-101, లైబ్రేరియన్లు-08, ప్రైమరీ టీచర్లు-75, ప్రిపరేటరీ టీచర్లు-06. సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, బయాలజీ తదితరాలు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 12. 

వెబ్‌సైట్‌: https://aees.gov.in/


ఏపీలో 149 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 149 విభాగాల వారీగా ఖాళీలు: ఎస్సీ/ ఎస్టీ బ్యాక్‌లాగ్‌-81, ఫిజికల్‌ ఛాలెంజ్‌డ్‌ పర్సన్స్‌-68 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 23 నుంచి. 

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


ప్రవేశాలు

ఎన్‌టీఏ-సీయూఈటీ (పీజీ) 2022

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సీయూఈటీ (పీజీ) 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - పీజీ (సీయూఈటీ-పీజీ) 2022

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 18. పరీక్ష తేదీలు: వెల్లడించాల్సి ఉంది. 

వెబ్‌సైట్‌: https://cuet.nta.nic.in/


ఐడీఆర్‌బీటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోని హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (పీజీడీబీటీ)

కోర్సు వ్యవధి: ఏడాది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతోన్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ అర్హత పరీక్షల స్కోర్‌ ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 07. 

వెబ్‌సైట్‌: www.idrbt.ac.in/


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని