ఉద్యోగాలు

చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది....

Published : 25 May 2022 00:19 IST

ఇండియన్‌ బ్యాంక్‌లో 312 పోస్టులు

చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 312 సీనియర్‌ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్లు. విభాగాలు: క్రెడిట్‌, అకౌంట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్ట్‌, ఐటీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 14.

వెబ్‌సైట్‌: ‌ www.indianbank.net.in/


ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 17. ప్రాజెక్ట్‌ సైంటిస్టులు-05, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-05, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు-07.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 02.

వెబ్‌సైట్‌: https://arci.res.in/


జిప్‌మర్‌లో 113 సీనియర్‌ రెసిడెంట్లు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరి, కరైకల్‌లోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్‌ రెసిడెంట్లు

మొత్తం ఖాళీలు: 113 (జిప్‌మర్‌ పుదుచ్చేరి 83, జిప్‌మర్‌ కరైకల్‌ 30)

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, జనరల్‌ మెడసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష తేది: 2022, జులై 09.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 20.

వెబ్‌సైట్‌: ‌www.jipmer.edu.in/


సీఎస్‌ఐఆర్‌-ఎన్‌సీఎల్‌లో...

పుణెలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌సీఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 09. ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-08, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 30.

వెబ్‌సైట్‌: ‌ www.nclnindia.org/


ఎకనమిక్‌ అఫైర్స్‌ విభాగంలో...

భారత ప్రభుత్వానికి చెందిన ఎకనమిక్‌ అఫైర్స్‌ విభాగం కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

యంగ్‌ ప్రొఫెషనల్స్‌ (ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్లు)

మొత్తం ఖాళీలు: 10

అర్హత: ఎకనమిక్స్‌/ ఫైనాన్స్‌/ మేనేజ్‌మెంట్‌/ కామర్స్‌ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 04.

వెబ్‌సైట్‌: https://dea.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని