నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) తూర్పుగోదావరి జిల్లాలో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 31 May 2022 05:50 IST

ఉద్యోగాలు

ఏపీవీవీపీ, తూర్పు గోదావరిలో....

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) తూర్పుగోదావరి జిల్లాలో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 57

పోస్టులు: ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, థియేటర్‌ అసిస్టెంట్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 02.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/


ఆర్మీ, సదరన్‌ కమాండ్‌లో...

ఇండియన్‌ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 32

పోస్టులు-ఖాళీలు: స్టెనో గ్రేడ్‌ 2-01, ఎల్‌డీసీ-08, కుక్‌-01, ఎంటీఎస్‌-22.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జూన్‌ 01.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


వాక్‌ఇన్‌

సీఎస్‌ఐఆర్‌-ఐఐపీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

దెహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం (ఐఐపీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 57

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-55, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-01, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, జూన్‌ 13 - 17.

వేదిక: ది డైరెక్టర్‌, సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం (ఐఐపీ), దెహ్రాదూన్‌.

వెబ్‌సైట్‌: https://www.iip.res.in/


ప్రవేశాలు

ఏఐహెచ్‌ఏ, హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లోని అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఏఐహెచ్‌ఏ) కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీహెచ్‌ఎం)

కోర్సు వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)

మొత్తం సీట్లు: 60

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 27.

పరీక్ష తేది: 2022, జులై 21.

వెబ్‌సైట్‌: www.apolloiha.ac.in/


అప్రెంటిషిప్‌

డీఆర్‌డీఓ-చెస్‌, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ-సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌) కింది విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 25

అప్రెంటిస్‌లు-ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ) అప్రెంటిస్‌లు-10, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు-15.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 12.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


వెస్టర్న్‌ రైల్వేలో 3612 ఖాళీలు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్‌ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 3612

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెకానిక్‌, పాసా.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణత.

వయసు: 27.06.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 27.

వెబ్‌సైట్‌: https://wr.indianrailways.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని