ఉద్యోగాలు

న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 01 Jun 2022 05:50 IST

ఐసీఎంఆర్‌లో 89 సైంటిస్టులు

న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్టులు

మొత్తం ఖాళీలు: 89 (సైంటిస్టు-ఈ: 07, సైంటిస్టు-సి: 82) విభాగాలు: పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎంటమాలజీ, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్‌ తదితరాలు అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 05.

వెబ్‌సైట్‌:  https://main.icmr.nic.in/


డీఎంహెచ్‌ఓ, మేడ్చల్‌లో 36 పోస్టులు

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 36. స్టాఫ్‌ నర్సులు-18, మెడికల్‌ ఆఫీసర్లు-18. అర్హత: పోస్టుల్ని అనుసరించి జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. టీఎస్‌/ ఏపీ మెడికల్‌/ నర్సింగ్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 04. చిరునామా: డీఎంహెచ్‌ఓ, బీ బ్లాక్‌, మొదటి అంతస్తు, కలెక్టర్‌ కాంప్లెక్స్‌, కీసర, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా.

వెబ్‌సైట్‌: https://medchal-malkajgiri.telangana.gov.in/


ఎస్‌సీఆర్‌, సికింద్రాబాద్‌లో...

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే లాలాగూడలోని సెంట్రల్‌ హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పారామెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హాస్పిటల్‌ అసిస్టెంట్లు

మొత్తం ఖాళీలు: 20 అర్హత: పదో తరగతి/ ఐటీఐ ఉత్తీర్ణత. వయసు: 19 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 04.

వెబ్‌సైట్‌: https://scr.indianrailways.gov.in/


డీఆర్‌డీఓ-ఎస్‌ఎస్‌పీఎల్‌లో...

దిల్లీ (తిమార్‌పూర్‌)లోని డీఆర్‌డీఓ-సాలిడ్‌స్టేట్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ (ఎస్‌ఎస్‌పీఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 12 విభాగాలు: ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెటీరియల్‌ సైన్స్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. నెట్‌/ గేట్‌ స్కోర్‌ ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


పవర్‌గ్రిడ్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ట్రెయినీలు (లా)

మొత్తం ఖాళీలు: 08 అర్హత: ఫుల్‌ టైమ్‌ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు/ తత్సమాన ఉత్తీర్ణత, క్లాట్‌ 2022 అర్హత. వయసు: 18.06.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: క్లాట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌, బిహేవియరల్‌ అసెస్‌మెంట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 18.

వెబ్‌సైట్‌: ‌ www.powergrid.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని