Updated : 06 Jun 2022 03:10 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్‌-ఎన్‌పీఎల్‌లో 79 పోస్టులు

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టెక్నీషియన్లు

మొత్తం ఖాళీలు: 79

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌) తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022,

జులై 03. చిరునామా: కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ, న్యూదిల్లీ-110012.

వెబ్‌సైట్‌: www.nplindia.org/


ఇండియన్‌ ఆర్మీ - 174 ఉద్యోగాలు

ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని 36 ఫీల్డ్‌ అమ్యూనిషన్‌ డిపో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 174

పోస్టులు: మెటీరియల్‌ అసిస్టెంట్లు, ఎల్‌డీసీ, ఫైర్‌మెన్‌, ట్రేడ్స్‌మెన్‌ మేట్స్‌, ఎంటీఎస్‌, డ్రాఫ్స్‌మెన్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.]

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


ప్రవేశాలు

ఏపీ డీఈఈసెట్‌-2022

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యా విభాగం 2022 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్‌ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో (డీఈఎల్‌ఈడీ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌ ప్రకటన విడుదల చేసింది.

* ఏపీ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ డీఈఈసెట్‌) 2022

కోర్సులు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ)

కాల వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2022 నాటికి కనిష్ఠ వయసు 17 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయసుతో సంబంధం లేదు.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 20.

పరీక్ష తేదీలు: 2022, జూన్‌ 28, 29.

వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in/


వాక్‌ఇన్‌

ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు-09, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-06, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-03.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, జూన్‌ 14, 15, 28, 29.

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ, ఉప్పల్‌ రోడ్‌, హైదరాబాద్‌-500007.

వెబ్‌సైట్‌: www.ngri.res.in/


అప్రెంటిస్‌షిప్‌

టీఎస్‌ఆర్‌టీసీలో 300 ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అప్రెంటిస్‌లు (ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌/ డిప్లొమా)

మొత్తం ఖాళీలు: 300

శిక్షణ వ్యవధి: మూడు సంవత్సరాలు.

అర్హత: ఏదైనా సబ్జెక్టులో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: డిప్లొమా, ఇంజినీరింగ్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: 2022, జూన్‌ 15. https://tsrtc.telangana.gov.in/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts