Published : 07 Jun 2022 01:05 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు


ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 41 పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌)కు చెందిన నోయిడా (యూపీ)లోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 41

పోస్టులు: ఇంజినీర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, సీనియర్‌ కెమిస్ట్‌ తదితరాలు.

విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌, సేఫ్టీ, హెచ్‌ఆర్‌, మెటీరియల్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 01.

వెబ్‌సైట్‌:www.nationalfertilizers.com/


ఇర్కాన్‌లో 56 ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 56

పోస్టులు: రిఫరెన్స్‌ పిన్‌ సెట్టింగ్‌ ఇంజినీర్లు, వర్క్స్‌ లీడర్‌, స్లాబ్‌ ట్రాక్‌ ఇంజినీర్‌, ఆపరేటర్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, వర్చువల్‌ (ఆన్‌లైన్‌) ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీలు: 2022 జూన్‌ 26 - జులై 01.

వెబ్‌సైట్‌:www.ircon.org/


ఓఎన్‌జీసీ, రాజమండ్రి యూనిట్‌లో..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ), రాజమండ్రి యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు: 33

విభాగాలు: ఫీల్డ్‌ డ్యూటీ, ఆక్యుపేషనల్‌ హెల్త్‌, జనరల్‌ డ్యూటీ.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 12.

వెబ్‌సైట్‌: ‌www.ongcindia.com/


ప్రవేశాలు

మహాత్మా జ్యోతిబాఫూలే ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2022

హాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2022-2023 విద్యాసంవత్సరానికి 14 జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఆర్‌జేసీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ సెట్‌ -2022

ఇంటర్‌ గ్రూపులు (ఇంగ్లిష్‌ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.

అర్హత: ఏప్రిల్‌ -2022లో పదోతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయసు: 31.08.2022 నాటికి 17 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.250 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 16.

ప్రవేశ పరీక్ష తేది: 2022, జూన్‌ 26.

వెబ్‌సైట్‌: https://apgpcet.apcfss.in/MJPAPBCWR/


ఏఐఎంఏ-యూజీఏటీ 2022

ల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) యూజీఏటీ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన వారికి ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

* ఏఐఎంఏ-అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (యూజీఏటీ)

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (పీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.750 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 15.

పరీక్ష తేది: 2022, జూన్‌ 25.

వెబ్‌సైట్‌: https://apps.aima.in/UGAT2022/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని