నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 09 Jun 2022 01:23 IST

ఉద్యోగాలు

ఏఏఐలో 400 పోస్టులు

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)

మొత్తం ఖాళీలు: 400

అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్‌, మ్యాథ్స్‌)/ బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ

వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/ వాయిస్‌ టెస్ట్‌, బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుల ప్రారంభం: 2022, జూన్‌ 15. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 14.

వెబ్‌సైట్‌: https://www.aai.aero/

ఎయిమ్స్‌, బీబీనగర్‌లో...

బీబీనగర్‌ (తెలంగాణ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 94

ప్రొఫెసర్లు-29, అడిషనల్‌ ప్రొఫెసర్లు-11, అసోసియేట్‌ ప్రొఫెసర్లు-18, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-36.

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in/

బెల్‌లో 43 ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 43 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 28.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

సిడ్బీలో 25 పోస్టులు

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన లఖ్‌నవూ ప్రధాన కేంద్రంగా స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా (సిడ్బీ) ఒప్పంద ప్రాతిపదికన (ఫుల్‌ టైం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు

మొత్తం ఖాళీలు: 25 అర్హత: డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌/ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/ సోషల్‌ వర్క్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: recruitment@sidbi.in దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 17.

వెబ్‌సైట్‌: https://www.sidbi.in/en

వాక్‌-ఇన్స్‌

ఎన్‌ఈఎస్‌ఏసీలో జేఆర్‌ఎఫ్‌లు

భారత ప్రభుత్వానికి చెందిన ఉమయం (మేఘాలయ)లోని నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎన్‌ఈఎస్‌ఏసీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 47

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, నెట్‌/ గేట్‌ అర్హత, అనుభవం. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఫెలోషిప్‌: నెలకు రూ.31000 చెల్లిస్తారు. వాక్‌ఇన్‌ తేదీలు: 2022, జూన్‌ 27 - జులై 05 వేదిక: ఎన్‌ఈఎస్‌ఏసీ, ఉమయం, మేఘాలయ.

వెబ్‌సైట్‌: https://nesac.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని