నోటిఫికేషన్స్‌

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), న్యూదిల్లీ కింది ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది.

Published : 15 Jun 2022 01:14 IST

ఉద్యోగాలు
ఎన్‌హెచ్‌ఏఐలో 50 పోస్టులు

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), న్యూదిల్లీ కింది ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది.

* డిప్యూటీ మేనేజర్లు (టెక్నికల్‌)

మొత్తం ఖాళీలు: 50

అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: యూపీఎస్సీ నిర్వహించిన 2021 ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (సివిల్‌)లో సాధించిన తుది మెరిట్‌ (రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌) ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 13.

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/


బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌), న్యూదిల్లీ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* యంగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం ఖాళీలు: 46 స్టాండర్డైజేషన్‌ - 04, రిసెర్చ్‌ అనాలసిస్‌ - 20, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సర్టిఫికేషన్‌ - 22.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ప్రాక్టికల్‌ అసెస్‌మెంట్‌, రిటన్‌ అసెస్‌మెంట్‌, టెక్నికల్‌ నాలెడ్జ్‌ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 15.

వెబ్‌సైట్‌: ‌www.bis.gov.in/


డీఎంఈ, ఏపీలో...

డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), విజయవాడ డైరెక్ట్‌, లేటరల్‌ ఎంట్రీ పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 54 (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌-24, లేటరల్‌ ఎంట్రీ-30)

విభాగాలు: రేడియో డయాగ్నసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌) ఉత్తీర్ణత

ఎంపిక: మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్‌, ఇతర వివరాల ఆధారంగా...

దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 28.

చిరునామా: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, హనుమాన్‌పేట, విజయవాడ-520003, ఏపీ.

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


ప్రవేశాలు
నైపెడ్‌, సికింద్రాబాద్‌లో...

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌), సికింద్రాబాద్‌ 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

కోర్సులు: ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఒకేషనల్‌ రిహాబిలిటేషన్‌

అందిస్తున్న సంస్థలు: నైపెడ్‌ - సికింద్రాబాద్‌, కోల్‌కతా, నవీ ముంబయి.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 29.

వెబ్‌సైట్‌: https://niepid.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు