నోటిఫికేషన్స్‌

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 16 Jun 2022 01:38 IST

ఉద్యోగాలు
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1326 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1326 (సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-969, ట్యూటర్లు-357) ఖాళీలున్న విభాగాలు: పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, డీఎంఈ, టీవీవీపీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌.

అర్హత: ఎంబీబీఎస్‌/ తత్సమాన ఉత్తీర్ణత. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఎంబీబీఎస్‌ మెరిట్‌ మార్కులు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో/ సంస్థల్లో/ ప్రోగ్రాముల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేసిన అనుభవం ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 15.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఆగస్టు 14.

వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in/


ఆర్మీ ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో 101 ఖాళీలు

మౌ (మధ్యప్రదేశ్‌)లోని ది ఇన్‌ఫాంట్రీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 101 ప్రాంతాల వారీగా ఖాళీలు: ఇన్‌ఫాంట్రీ స్కూల్‌, మౌ స్టేషన్‌: 65, ఇన్‌ఫాంట్రీ స్కూల్‌, బెల్గాం (కర్ణాటక): 36 పోస్టులు. డ్రాఫ్ట్స్‌మెన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, స్టెనోగ్రాఫర్‌, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌, కుక్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 25.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


ప్రవేశాలు
ఐఐహెచ్‌టీ, తిరుపతిలో...

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ.. అన్ని ఐఐహెచ్‌టీలకు ఉమ్మడిగా ఉండే డిప్లొమా ఇన్‌ హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సు, డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ లాటరల్‌ ఎంట్రీ కోర్సు

అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.  వయసు: 15 - 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 15.

వెబ్‌సైట్‌: www.iihtvgr.com/


టీటీడీ - కలంకారీ కళలో డిప్లొమా కోర్సు

తిరుమల తిరుపతి దేవస్థానాలు(తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల.. 2022-23 విద్యా సంవత్సరానికి డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: డిప్లొమా కోర్సు (సంప్రదాయ కలంకారీ కళ), సర్టిఫికెట్‌ కోర్సు (సంప్రదాయ కలంకారీ కళ)

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వయసు: 15 - 20 ఏళ్ల మధ్య ఉండాలి.

పిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

రఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి ప్రధానోపాధ్యాయుడు, శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల, అలిపిరి రోడ్‌, తిరుపతి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 10.

వెబ్‌సైట్‌: www.tirumala.org/


వాక్‌ఇన్‌
డీఎల్‌ఎస్‌ఆర్‌సీఐ, హైదరాబాద్‌లో...

కంచన్‌బాగ్‌ (హైదరాబాద్‌)లోని డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

పోస్టులు: ప్రీ-ప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లు, టీజీటీ, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, మ్యూజిక్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. డీఈడీ/ బీఈడీతో పాటు సీటెట్‌/ టెట్‌ అర్హత, టీచింగ్‌ అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, జూన్‌ 17, 18. వేదిక: డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, కంచన్‌బాగ్‌, హైదరాబాద్‌-500058.

వెబ్‌సైట్‌: https://dlsrci.patasala.in/


అప్రెంటిస్‌షిప్‌
ఎన్‌పీసీఐఎల్‌లో 177 ఖాళీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కు చెందిన కాక్రపార గుజరాత్‌ సైట్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 177 ట్రేడులు: ఎల‌్రక్టీషియన్‌, ఫిట్టర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఎల‌్రక్టానిక్‌ మెకానిక్‌, కోపా, వెల్డర్‌, టర్నర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు: 15.07.2022 నాటికి 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022. జులై 15.

వెబ్‌సైట్‌: https://npcil.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు