ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న పీజీఐఎంఎస్‌ఆర్‌లు, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీల్లో కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి...

Published : 20 Jun 2022 00:17 IST

ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 491 పోస్టులు

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న పీజీఐఎంఎస్‌ఆర్‌లు, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీల్లో కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 491,

స్పెషలైజేషన్లు: అనాటమీ, అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్‌, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత. సంబంధిత టీచింగ్‌ అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

వేతన శ్రేణి: రూ.67700-రూ.208700..

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500.

చిరునామా: ది రీజనల్‌ డైరెక్టర్‌, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌, పంచ్‌దీప్‌ భవన్‌, సెక్టర్‌ 16, ఫరీదాబాద్‌, హరియాణ-121002.

దరఖాస్తు చివరి తేదీ: జులై 18, 2022.

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/


ఆర్మీ - సెంట్రల్‌ కమాండ్‌లో 88 పోస్టులు
 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌)లోని సెంట్రల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 88, పోస్టుల

వారీగా: కుక్‌-04, వార్డ్‌ సహాయక్‌-84.

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ ఫిజికల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష: మొత్తం 150 మార్కులకు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2)

మొత్తం ఖాళీలు: 177. అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌/ ఐటీ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఆరు నెలల సర్టిఫికెట్‌లో కోర్సు అర్హత సాధించాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 20, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2022.

వెబ్‌సైట్‌: https://scclmines.com//scclnew/index.asp 


సుప్రీం కోర్టులో 210 జూనియర్‌ కోర్టు అసిస్టెంట్లు

భారత సుప్రీం కోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ కోర్టు అసిస్టెంట్లు

మొత్తం ఖాళీలు: 210.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ. ఇంగ్లిష్‌ టైపింగ్‌లో నైపుణ్యంతో పాటు కంప్యూటర్‌ ఆపరేషన్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 - 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్‌ టైప్‌ రాత పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: జులై 10, 2022.

వెబ్‌సైట్‌:  https://main.sci.gov.in/


అప్రెంటిస్‌షిప్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌, హైదరాబాద్‌లో 68 ఖాళీలు

హైదరాబాద్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌లు.

మొత్తం ఖాళీలు: 68, విభాగాలు/ సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఈఈఈ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత.

స్టైపెండ్‌: నెలకు రూ.8000-రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక: సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ కేటగిరీల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 22, 2022.

బీఎస్‌ఎన్‌ఎల్‌, హైదరాబాద్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 24, 2022.

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని