నోటిఫికేషన్స్‌

నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 21 Jun 2022 00:46 IST

ఉద్యోగాలు

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో 82 పోస్టులు

నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్‌) మొత్తం ఖాళీలు: 82 అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. వయసు: 01-01-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుల ప్రారంభం: 2022, జూన్‌ 27 నుంచి. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 11 వరకు. పరీక్ష తేది: 2022, ఆగస్టు 14. వెబ్‌సైట్‌: https://tsnpdcl.in/

నీలిట్‌లో 66 పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 66. నాన్‌ టెక్నికల్‌ పోస్టులు-27, టెక్నికల్‌ పోస్టులు-39. అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సైంటిస్టులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీసీఏ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, ఎమ్మెస్సీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 19. వెబ్‌సైట్‌: https://nielit.gov.in/


ప్రవేశాలు

ఫైన్‌ ఆర్ట్స్‌ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2022-2023 విద్యాసంవత్సరానికి మల్కాజ్‌గిరి, ఏదులాబాద్‌, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ జిల్లాలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పాఠశాలల్లో ఆరోతరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్లు: 80 ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాలు: క్లాసికల్‌ మ్యూజిక్‌ (కర్నాటిక్‌, హిందుస్థానీ), ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ (వయోలిన్‌, మృదంగం, తబలా, కీబోర్డు, గిటార్‌), డ్యాన్స్‌ (కూచిపూడి, కథక్‌), పెయింటింగ్‌ అండ్‌ డ్రాయింగ్‌. అర్హత: 2021-2022 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 28. ప్రవేశ పరీక్ష, ఫైన్‌ ఆర్ట్స్‌ స్కిల్‌ టెస్ట్‌ తేది: 2022, జులై 03. వెబ్‌సైట్‌: www.tswreis.ac.in/


అప్రెంటిస్‌లు

ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో...

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) ముంబయిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 92 అప్రెంటిస్‌లు: గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు, జూనియర్‌ సూపర్‌వైజర్లు, ట్రేడ్స్‌మెన్‌ ట్రెయినీలు తదితరాలు. విభాగాలు: ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, టెక్నికల్‌, రాజ్‌భాష, ఐటీఐ అర్హత: అప్రెంటిస్‌లను అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్‌/ సీఎంఏ ఉత్తీర్ణత. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 07. www.irel.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని