Published : 23 Jun 2022 00:24 IST

ఉద్యోగాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 325

పోస్టులు-ఖాళీలు: రిలేషన్‌షిప్‌ మేనేజర్లు-175,  క్రెడిట్‌ అనలిస్టులు-150.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫైనాన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ/ సీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 12.

వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/


ఐడీబీఐలో 226 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు మొత్తం ఖాళీలు: 226. గ్రేడ్‌ బి (మేనేజర్లు)-82, గ్రేడ్‌ సి (అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు)-111, గ్రేడ్‌ డి (డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు)-82

విభాగాలు: ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ, లీగల్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుల ప్రారంభం: 2022, జూన్‌ 25.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 10.

వెబ్‌సైట్‌: ‌www.idbibank.in/


కామర్స్‌ విభాగంలో 65 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ కామర్స్‌, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన కామర్స్‌ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 65. యంగ్‌ ప్రొఫెషనల్స్‌-22, అసోసియేట్లు-19, కనల్టెంట్లు-15, సీనియర్‌ కన్సల్టెంట్లు-09.

విభాగాలు: ఎకనామిక్స్‌, లీగల్‌, పబ్లిక్‌ పాలిసీ, డేటా సైన్స్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌.

దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 13.

వెబ్‌సైట్‌: https://commerce.gov.in/


బీఆర్‌ఓలో 1178 ఖాళీలు

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 1178. మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (మాసన్‌)-147, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (నర్సింగ్‌ అసిస్టెంట్‌)-155, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌-377, మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌)-499

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (మాసన్‌, నర్సింగ్‌ అసిస్టెంట్‌) పోస్టులకు 2022, జులై 22, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌) పోస్టులకు 2022, జులై 11.

వెబ్‌సైట్‌: ‌ www.bro.gov.in/


టీవీవీపీ ఆసుపత్రుల్లో 50 పోస్టులు

హైదరాబాద్‌ జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేయడానికి కింది పోస్టుల భర్తీకి ప్రోగ్రాం ఆఫీసర్‌ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

సీఏఎస్‌ (స్పెషలిస్ట్‌) మొత్తం పోస్టులు: 50

స్పెషలైజేషన్లు: గైనకాలజీ, రేడియాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్‌, జనరల్‌ మెడిసిన్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 34 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఎస్‌అండ్‌ఐ), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 27.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని