నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్‌ (దిల్లీ)లోని డీఆర్‌డీఓ-రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 27 Jun 2022 01:53 IST

డీఆర్‌డీఓ- ఆర్‌ఏసీలో సైంటిస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్‌ (దిల్లీ)లోని డీఆర్‌డీఓ-రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సైంటిస్టు-బి పోస్టులు

మొత్తం ఖాళీలు: 630

సంస్థల వారీగా ఖాళీలు: డీఆర్‌డీఓ-579, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ)-43, డీఎస్‌టీ-08.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, గేట్‌ స్కోర్‌ ఉండాలి.

వయసు: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గేట్‌ మెరిట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

రాత పరీక్ష తేదీ: 2022, అక్టోబరు 16.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://rac.gov.in/


ఉద్యోగాలు

బార్క్‌లో 89 పోస్టులు

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భాభా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) వివిధ న్యూక్లియర్‌ రీసైకిల్‌ బోర్డుల్లో (కల్పక్కం, తారాపూర్‌, ముంబయి) కింది గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 89

పోస్టులు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్లు-06, డ్రైవర్లు (ఆర్డినరీ గ్రేడ్‌)-11, వర్క్‌ అసిస్టెంట్లు-72.

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్పీడ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్‌/ డ్రైవింగ్‌ టెస్ట్‌/ అడ్వాన్సడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 01.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 31.

వెబ్‌సైట్‌: https://recruit.barc.gov.in/


ప్రవేశాలు

ఏపీపీజీసెట్‌-2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కడప జిల్లాలోని యోగి వేయన యూనివర్సిటీ 2022 విద్యాసంవత్సరానికి ఏపీపీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2022 (ఏపీపీజీసెట్‌)

అందిస్తున్న పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ టెక్నాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత పొందిన/ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 20.

ఏపీపీజీసెట్‌ 2022పరీక్ష తేదీ: 2022, ఆగస్టు 17.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/


ఏపీ పీఈసెట్‌-2022

వ్యాయామ ఉపాధ్యాయ విద్య- బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ వ్యాయామ ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష(ఏపీ పీఈసెట్‌)- 2022 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్‌ను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

కోర్సులు: యూజీడీపీఈడీ (రెండేళ్లు), బీపీఈడీ (రెండేళ్లు)

అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

పరీక్ష: శారీరక సామర్థ్యం, ఆటలో నైపుణ్య పరీక్షల ఆధారంగా.

పరీక్ష కేంద్రం: ఏఎన్‌యూ, నాగార్జున నగర్‌, గుంటూరు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 19.

పరీక్ష తేదీ: 2022, ఆగస్టు 08.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/


సీడ్యాక్‌-సీక్యాట్‌ 2022

భారత ప్రభుత్వానికి చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ-డ్యాక్‌) 2022 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీ-క్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* సీ-డ్యాక్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీ-క్యాట్‌) సెప్టెంబరు 2022

కోర్సులు: పీజీ డిప్లొమా(అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌) తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ /ఎమ్మెస్సీ/ఎంఎస్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీ-క్యాట్‌) ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 12.

పరీక్ష తేదీలు: 2022, జులై 23, 24.

వెబ్‌సైట్‌: www.cdac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని