Published : 28 Jun 2022 01:09 IST

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో కొలువులు

ప్రకటించిన మొత్తం 1178 ఉద్యోగాల్లో...  

సాయుధ దళాల వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టే సంస్థే బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌. న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందినది. దీని ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో వంతెనలు, జాతీయ రహదారులు, సొరంగ మార్గాలు, ఎయిర్‌పోర్టులను నిర్మించారు. ఇప్పుడీ సంస్థ 1178 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ ఖాళీలు మొత్తం 377. వీటిలో అన్‌రిజర్వ్‌డ్‌-157, ఎస్సీ-53, ఎస్టీ-26, ఓబీసీ-103, ఈడబ్ల్యూఎస్‌-38 ఉన్నాయి. అర్హతలు: అభ్యర్థుల వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. వెహికిల్‌ లేదా ఇంజినీరింగ్‌ పరికరాలకు సంబంధించిన స్టోర్‌కీపింగ్‌ పరిజ్ఞానం ఉండాలి. స్టోర్స్‌లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌) ఖాళీలు మొత్తం 499. వీటిలో అన్‌రిజర్వుడ్‌-164, ఎస్సీ-90, ఎస్టీ-50, ఓబీసీ-177, ఈడబ్ల్యూఎస్‌-18 ఉన్నాయి.

అర్హతలు: అభ్యర్థుల వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 10+2/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. ఐటీఐ నుంచి మెకానిక్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.50. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు ఎలా?: ప్రకటనలో పేర్కొన్న విధంగా దరఖాస్తును నింపి రిజిస్టర్డు పోస్టులో పంపించాలి. దరఖాస్తులను హిందీ లేదా ఇంగ్లిష్‌లో నింపాలి. రెండు పోస్టులకూ దరఖాస్తు చేసినవారు వేర్వేరుగా దరఖాస్తులను నింపి, వేర్వేరుగా ఫీజు చెల్లించాలి. అర్హులైన అభ్యర్థులకు కాల్‌ లెటర్స్‌ను పోస్ట్‌ ద్వారా పంపుతారు. అయినప్పటికీ తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి.

ఎంపిక: స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. రాత పరీక్షలో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

ఈ పరీక్ష ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌/సబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఓఎంఆర్‌ షీట్‌ మీద సమాధానాలు గుర్తించాలి. సబ్జెక్టివ్‌ ప్రశ్నలకు జవాబులను ఆన్సర్‌షీట్‌ మీద రాయాలి. స్టోర్స్‌ అకౌంటింగ్‌, రిసీట్‌, ఇన్‌స్పెక్షన్‌, ప్రిజర్వేషన్‌, స్టోరేజ్‌, ఫైర్‌ ప్రొటెక్షన్‌/ ఫైటింగ్‌ ముందు జాగ్రత్తలు, స్టాక్‌ వెరిఫికేషన్‌, ప్యాకేజింగ్‌, డిస్పాచ్‌, స్టాక్‌ లెడ్జర్‌ నిర్వహణ, స్టోర్స్‌ సెక్యూరిటీ, అరిథ్‌మెటిక్‌, జనరల్‌ నాలెడ్జ్‌ మొదలైన అంశాల నుంచి రాత పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు మూల వేతనం రూ.19,900 ఉంటుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం.

మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌): స్టాటిక్‌ ఇంజిన్‌/జనరేటర్‌ సెట్‌/కాంక్రీట్‌ మిక్చర్స్‌ను ఆపరేట్‌ చేయడం, వీటిలోని లోపాలను పరీక్షించడం, ఈ మూడు యంత్రాల నిర్వహణ, స్టాటిక్‌ ఇంజిన్స్‌లో ఫ్యూయల్స్‌/ఆయిల్స్‌/ల్యూబ్స్‌ ఉయోగించడం, జనరల్‌ నాలెడ్జ్‌.. మొదలైన అంశాల మీద రాత పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి. ఈ అభ్యర్థులు ప్రాక్టికల్‌/స్కిల్‌ టెస్ట్‌లోనూ అర్హత సాధించాలి. దీంట్లో భాగంగా.. స్టాటిక్‌ ఇంజిన్‌కు సంబంధించిన ఇంజిన్‌ పార్ట్స్‌, ఆయిల్స్‌/ల్యూబ్స్‌, టూల్స్‌, పనిముట్లను గుర్తించాలి. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు మూల వేతనం రూ.18,000. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు అదనం.  

* స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌, మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌) ఈ రెండు పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. శారీరక సామర్థ్య పరీక్షలో భాగంగా మైలు దూరాన్ని 10 నిమిషాల్లో పూర్తిచేయాలి. దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థులు కనీసం 150 సెం.మీ. పొడవు, 50 కేజీల బరువు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత 75 సెం.మీ. ఉండి గాలి పీల్చినప్పుడు 5.సెం.మీ. పెరగాలి.

* ఫిజికల్‌ ఎఫిషియన్సీ, ప్రాక్టికల్‌ (ట్రేడ్‌ టెస్ట్‌), రాత పరీక్షలను సాధారణంగా జీఆర్‌ఈఎఫ్‌ సెంటర్‌, డిఘీ క్యాంప్‌, అలన్‌డి రోడ్‌, పుణెలో నిర్వహిస్తారు. పాలనాపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అభ్యర్థుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే కేంద్రాల్లో పరీక్షలు జరుపుతారు.  

దరఖాస్తులకు చివరి తేది: జులై 11, 2022.

వెబ్‌సైట్‌: www.bro.gov.in


మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (మాసన్‌) ఖాళీలు 147. వీటిలో అన్‌రిజర్వ్‌డ్‌-26, ఎస్సీ-30, ఎస్టీ-15, ఓబీసీ-56, ఈడబ్ల్యూఎస్‌-20 ఉన్నాయి.

అర్హతలు: ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.  పదోతరగతి/తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌/బ్రిస్క్‌ మాసన్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌/ నేషనల్‌ కౌన్సిల్‌లో ఒకేషనల్‌ ట్రేడ్స్‌లో ట్రెయినింగ్‌/ స్టేట్‌ కౌన్సిల్‌లో ఒకేషనల్‌ ట్రెయినింగ్‌ తీసుకున్న వారై ఉండాలి.

మల్టీస్కిల్డ్‌ వర్కర్‌ (నర్సింగ్‌ అసిస్టెంట్‌) ఖాళీలు 155. వీటిలో అన్‌రిజర్వ్‌డ్‌-56, ఎస్సీ-26, ఎస్టీ-13, ఓబీసీ-44, ఈడబ్ల్యూఎస్‌-16 ఉన్నాయి.

అర్హతలు: అభ్యర్థుల వయసు 18-27 సంవత్సరాలు ఉండాలి. బయాలజీతో 10+2 పాసై ఉండాలి. నర్సింగ్‌/ఆక్సిలరీ నర్సింగ్‌ మిడ్‌ఫైఫరీ (ఏఎన్‌ఎం)లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు పాసై ఉండాలి. లేదా నర్సింగ్‌/ఫార్మసీలో ఉన్నత విద్య (డిప్లొమా/డిగ్రీ/గ్రాడ్యుయేషన్‌) పూర్తిచేసి ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని