‘నవోదయ’లో.. టీచర్ల భర్తీ

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి... దేశవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ పాఠశాలల్లో ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే ఆసక్తి,

Published : 05 Jul 2022 01:32 IST

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి... దేశవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ పాఠశాలల్లో ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరమైన కొలువు పొందొచ్చు.

వోదయలో ఉపాధ్యాయులుగా చేరడం వల్ల జీతభత్యాలతోపాటు అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ టీచర్లకు పోస్టింగ్‌ లభించిన చోట క్వార్టర్స్‌ ఉచితంగా కేటాయిస్తారు. విద్యార్థులతోపాటు భోజన వసతి ఉంటుంది. మొత్తం జీతంపై 10శాతం స్పెషల్‌ అలవెన్స్‌గా చెల్లిస్తారు.

మొత్తం ఖాళీలు: 1616

ప్రిన్సిపల్‌: 12

పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌): 397

టీజీటీ (టైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌): 683

టీజీటీ (థర్డ్‌ లాంగ్వేజ్‌): 343

ఆర్ట్‌, పీఈటీ, లైబ్రేరియన్‌ పోస్టులు: 181

అర్హతలు

ప్రిన్సిపల్‌ పోస్టులకు మాస్టర్స్‌ డిగ్రీ కనీసం 50% శాతం మార్కులతో పాసై ఉండాలి. బీఈడీ లేదా తత్సమాన అర్హత కావాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఏదో ఒక పని అనుభవం తప్పనిసరి. 50 ఏళ్లలోపు వయసు ఉండాలి.

పీజీటీ పోస్టులకు సంబంధిత విభాగంలో రెండేళ్ల కోర్సు, బీఈడీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత అవసరం. వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.  

టీజీటీ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లేదాడిగ్రీతోపాటు బీఎడ్‌ 50% మార్కులతో పాసై ఉండాలి. సంబంధిత సబ్జెక్టును మూడేళ్లు చదివి ఉండాలి.

ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌, డిప్ల్లొమా (లైబ్రరీ సైన్స్‌), బీపీఈడీ, డిప్ల్లొమా (ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ (మ్యూజిక్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయః పరిమితి 35 ఏళ్లు.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా..

* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో...

దరఖాస్తు ఫీజు : ప్రిన్సిపల్‌ పోస్టులకు - రూ.2 వేలు, పీజీటీ - 1,800/-, టీజీటీ ఇతర కేటగిరీలకు - 1,500/-

* దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22

ఎలా చదవాలి?

ఈ పరీక్షలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు ప్రాముఖ్యం ఇస్తూనే మిగతా అంశాలనూ జోడించారు. అందువల్ల ఉన్న సమయంలో సగం సబ్జెక్టుకు కేటాయించి, మిగతా సమయంలో అన్ని అంశాలూ కలిపి సన్నద్ధం కావాలి. ప్రతి విభాగానికి సంబంధించి పూర్తి సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జనరల్‌ అవేర్‌నెస్‌లో వర్తమాన వ్యవహారాలతోపాటు స్టాటిక్‌ జీకే కూడా కలిపి చదవాలి. భారత స్వాతంత్య్రోద్యమంతోపాటు చరిత్ర, ఆర్థికశాస్త్రం, పౌరశాస్త్రంలో ప్రాథమిక భావనలు తెలుసుకోవాలి. క్రీడలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దీనికి అదనం. రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌లో దాదాపు టాపిక్స్‌ అన్నింటినీ సిలబస్‌లో ఇచ్చారు. అందువల్ల అన్నీ చదువుకోవాలి. ఐసీటీ అంటే ‘ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’. ఇందులో రోజువారీ జీవితంలో ఉపయోగించే సాంకేతికత గురించి ప్రశ్నలుంటాయి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ఇతర టెక్నాలజీ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.

* అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టులో లోతైన అవగాహన, బిట్ల సాధన తప్పనిసరి. హిందీ, ఇంగ్లిష్‌ భాషల విభాగంలో కనీస అర్హత సాధిస్తే చాలు (క్వాలిఫైయింగ్‌ నేచర్‌). అందువల్ల ఈ ప్రాధాన్యాలను గమనించి అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని