ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థ టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

Updated : 06 Jul 2022 05:53 IST

టీహెచ్‌డీసీలో 45 పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థ టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇంజినీర్‌ ట్రెయినీలు మొత్తం పోస్టులు: 45.

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్‌-20, ఎలక్ట్రికల్‌-15, మెకానికల్‌-10.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.50000.

ఎంపిక: గేట్‌-2022 మెరిట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 01.

వెబ్‌సైట్‌: https://thdc.co.in/


వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో...

దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 45. ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు, అసిస్టెంట్‌ ట్రెయినింగ్‌ కోఆర్డినేటర్లు తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 30.

వెబ్‌సైట్‌: https://wii.gov.in/


రైల్‌టెల్‌ కార్పొరేషన్‌లో ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇంజినీర్లు/ ప్రాజెక్ట్‌ మేనేజర్లు  మొత్తం పోస్టులు: 37

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 26 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 25.

వెబ్‌సైట్‌: www.railtelindia.com/


ప్రవేశాలు

జేఎన్‌టీయూ, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అందిస్తున్న కోర్సులు: బ్లాక్‌చెయిన్‌, పైతాన్‌ ప్రోగ్రామింగ్‌తో డేటా సైన్స్‌, క్లౌడ్‌, డెవలప్‌మెంట్‌ ఆపరేషన్స్‌ 

అర్హత: డిప్లొమా/ యూజీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. ఏదైనా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌పై పరిజ్ఞానం ఉండాలి.

కోర్సు వ్యవధి: 6 నెలలు.

దరఖాస్తుల చివరి తేదీ: 2022, జులై 23.

తరగతులు ప్రారంభం: 2022, ఆగస్టు 15.

వెబ్‌సైట్‌:  https://doa.jntuh.ac.in/


వైఎస్సార్‌ఏఎఫ్‌యూ-ఏడీసెట్‌ 2022

డపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్స్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (వైఎస్సార్‌ఏఎఫ్‌యూ) మొదటి ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌), యానిమేషన్‌.

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.

అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. ఆలస్య రుసుం లేకుండా

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 03 ఆలస్య రుసుంతో

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 10.

పరీక్ష తేది: 2022, ఆగస్టు 20.

వెబ్‌సైట్‌: www.ysrafu.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని