కోల్‌ ఇండియాలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ‘మహారత్న’ సంస్థ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌). కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ 481 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌ను

Updated : 25 Jul 2022 19:42 IST

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ‘మహారత్న’ సంస్థ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌). కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ 481 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ఇంజినీరింగ్‌ డిగ్రీ/పీజీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ పూర్తిచేసుకున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు!

ప్రకటించిన మొత్తం 481 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఖాళీల్లో జనరల్‌కు-213, ఈడ బ్ల్యూఎస్‌లకు-47, ఎస్సీలకు-65, ఎస్టీలకు-34, ఓబీసీలకు (ఎన్‌సీఎల్‌)-122 కేటాయించారు.

* పర్సనల్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ విభాగంలో 138 పోస్టులున్నాయి. (జనరల్‌-60, ఈడబ్ల్యూఎస్‌-14, ఎస్సీ-20, ఎస్టీ-8, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-36) .

* ఎన్విరాన్‌మెంట్‌ విభాగంలో 68 ఖాళీలున్నాయి. (జనరల్‌-30, ఈడబ్ల్యూఎస్‌-7, ఎస్సీ-10, ఎస్టీ-5, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-16)

* మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో 115 ఖాళీలున్నాయి. (జనరల్‌-53, ఈడబ్ల్యూఎస్‌-11, ఎస్సీ-14, ఎస్టీ-8, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-29)

* మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ విభాగంలో 17 పోస్టులు ఉన్నాయి. (జనరల్‌-10, ఈడబ్ల్యూఎస్‌-2, ఎస్సీ-2, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-3)

కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో 79 ఖాళీలున్నాయి. (జనరల్‌-33, ఈడబ్ల్యూఎస్‌-8, ఎస్సీ-11, ఎస్టీ-6, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-21)

* లీగల్‌ విభాగంలో 54 పోస్టులు ఉన్నాయి. (జనరల్‌-21, ఈడబ్ల్యూఎస్‌-5, ఎస్సీ-8, ఎస్టీ-6, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-14) .

* పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగంలో 6 ఖాళీలున్నాయి. (జనరల్‌-3, ఎస్టీ-1, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-2)

* కంపెనీ సెక్రటరీ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. జనరల్‌-3, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)-01).

ఎంపిక: అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా ఉంటుంది. ఈ పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2.. ఒక్కో దానికి 100 మార్కుల చొప్పున ఉంటాయి. పేపర్‌-1లో జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్‌ ఉంటాయి. పేపర్‌-2 ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన) ప్రశ్నలుంటాయి. రెండు పేపర్లలోనూ 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు లేవు

అర్హత మార్కులు: జనరల్‌ (యూఆర్‌)/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ప్రతి పేపర్‌లోనూ 40 మార్కులు సాధించాలి. ఓబీసీ (నాన్‌-క్రీమీ లేయర్‌) అభ్యర్థులు ప్రతి పేపర్‌లోనూ 35 మార్కులు పొందాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రతి పేపర్‌లోనూ 30 మార్కులు రావాలి. సీబీటీని ఏ తేదీన నిర్వహించేదీ ఈ మెయిల్‌ ద్వారా పంపే అడ్మిట్‌ కార్డ్‌లో తెలియజేస్తారు.

* సీబీటీలో ప్రతిభ చూపిన విద్యార్థుల పేర్ల లిస్టును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: ఆన్‌లైన్‌ దరఖాస్తులో తెలియజేసిన నగరాల్లో పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో మూడు నగరాలను ఎంపికచేసుకోవాలి. ఒకసారి దరఖాస్తును సమర్పించిన తర్వాత ఎలాంటి మార్పులకూ అవకాశం ఉండదు.

దరఖాస్తు ఫీజు: రూ.1180 ఫీజును ఆన్‌లైన్‌ విధానంలోనే చెల్లించాలి. జనరల్‌ (యుఆర్‌)/ ఓబీసీ (క్రీమీ లేయర్‌, నాన్‌ క్రీమీ లేయర్‌)/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈఎస్‌ఎం/కోల్‌ ఇండియా ఉద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

గరిష్ఠ వయఃపరిమితి: మే 31, 2022 నాటికి జనరల్‌ (యుఆర్‌), ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు.

* ఓబీసీ (నాన్‌-క్రీమీలేయర్‌) అభ్యర్థులకు 3, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

* పీడబ్ల్యూడీ (జనరల్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ (నాన్‌-క్రీమీ లేయర్‌) 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08.07.2022

దరఖాస్తులకు చివరి తేదీ: 07.08.2022


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని