ఉద్యోగాలు

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కింది పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది...

Updated : 11 Jul 2022 07:03 IST

ఎస్‌ఎస్‌సీ-దిల్లీ పోలీసు విభాగంలో 2268 పోస్టులు

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కింది పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు-ఖాళీలు: కానిస్టేబుల్‌(డ్రైవర్‌)-1411 (పురుషులు), హెడ్‌ కానిస్టేబుల్‌(ఏడబ్ల్యూఓ/టీపీఓ)-857 (పురుషులు)

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌.

వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, కొలత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 29.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 2022, అక్టోబర్‌లో ఉంటుంది..

వెబ్‌సైట్‌: https://ssc.nic.in


తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వివిధ పోస్టుల భర్తీకి మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్టు మాస్టర్లు/ పర్సనల్‌ సెక్రెటరీలు

మొత్తం పోస్టులు: 65

అర్హత: ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌/ లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్‌ సర్టిఫికెట్లు ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌/ ఓరల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 22.

చిరునామా: రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌), తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్‌-500066.

వెబ్‌సైట్‌:https://tshc.gov.in/


ఐటీబీపీలో 37 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఓవర్‌సీర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 37
అర్హత: మెట్రిక్యులేషన్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 16.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 14.

వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/


ప్రవేశాలు

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రాం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

సీట్ల సంఖ్య: 234

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ (ఫైన్‌ ఆర్ట్స్‌, ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ మినహా) ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ప్రవేశ పరీక్ష తేదీ: 2022, ఆగస్టు 21.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 26.

వెబ్‌సైట్‌: https://www.braouonline.in/


అప్రెంటిస్‌షిప్‌

మజ్‌గావ్‌డాక్‌లో 445 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

ముంబయిలోని మజుగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ వివిధ ట్రేడుల్లో  అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి, గ్రూప్‌ సి)

మొత్తం ఖాళీలు: 445

ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, పైప్‌ ఫిట్టర్‌, స్ట్రక్చరల్‌ ఫిట్టర్‌, వెల్డర్‌, కోపా తదితరాలు.

అర్హత: వివిధ గ్రూపులని అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 21.

పరీక్ష తేదీ: 2022, జులై 30

వెబ్‌సైట్‌: https://mazagondock.in/ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని