నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) 2022 సంవత్సరానికి ఆఫీసర్స్‌-గ్రేడ్‌ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 13 Jul 2022 23:49 IST

ఉద్యోగాలు

నాబార్డ్‌లో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఏ పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) 2022 సంవత్సరానికి ఆఫీసర్స్‌-గ్రేడ్‌ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 170

విభాగాలు-ఖాళీలు: రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌-161, రాజ్‌భాష సర్వీస్‌-07, ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌-02.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 18.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 07.

వెబ్‌సైట్‌: www.nabard.org/


సీ-డ్యాక్‌లో 104 అడ్జంక్ట్‌ ఇంజినీర్లు

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అడ్జంక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం పోస్టులు: 104

పోస్టులు: సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్లు, సీనియర్‌ డెవలపర్‌, డేటా సెంటర్‌ మేనేజర్‌ తదితరాలు.

విభాగాలు: సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ సర్వీసెస్‌, ఐఓటీ టెక్నాలజీస్‌, మొబైల్‌ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ డిస్కషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 18.

వెబ్‌సైట్‌: www.cdac.in/


ఎన్‌టీపీసీలో 60 ఉద్యోగాలు

న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) రెన్యువబుల్‌ ఎనర్జీ (ఆర్‌ఈ) విభాగంలో కింది ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 60

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, కమర్షియల్‌, ఫైనాన్స్‌, అకౌంట్స్‌, సేఫ్టీ, ఐటీ తదితరాలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 15.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 29.

వెబ్‌సైట్‌: www.ntpc.co.in/


భెల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (భెెల్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం పోస్టులు: 22 (ఎలక్ట్రానిక్స్‌-21, మెకానికల్‌-01)

పని ప్రదేశాల వారీగా ఖాళీలు: విశాఖపట్నం-08, ముంబయి-07, కొచ్చిన్‌-01, కార్వార్‌-03, పోర్ట్‌ బ్లెయిర్‌-03.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: వెల్లడించాల్సి ఉంది.

వెబ్‌సైట్‌: www.belnindia.in/


వాక్‌ఇన్‌

ఏఐఈఎస్‌ఎల్‌లో 78 పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్లు (ఏఎంఈ)

మొత్తం పోస్టులు: 78

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత. డీజీసీఏ లైసెన్స్‌తో పాటు ఇతర టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, జులై 18, 19.

వేదిక: ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, రెండో అంతస్తు, సీఆర్‌ఏ బిల్డింగ్‌, సఫ్తర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ కాంప్లెక్స్‌, అరబిందో మార్గ్‌, న్యూదిల్లీ-110003.

వెబ్‌సైట్‌: www.aiesl.in/


అప్రెంటిస్‌లు

రైట్స్‌ లిమిటెడ్‌లో 91 ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన రైట్స్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 91

అప్రెంటిస్‌లు-ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు-72, డిప్లొమా అప్రెంటిస్‌లు-10, ట్రేడ్‌ (ఐటీఐ) అప్రెంటిస్‌లు-09.

అర్హత: అప్రెంటిస్‌లను అనుసరించి ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఏ/ బీబీఏ/ బీకాం, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 31. www.rites.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని