నోటిఫికేషన్స్‌

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీ- జేఈఈ(మెయిన్‌/ అడ్వాన్స్‌డ్‌), నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌....

Published : 18 Jul 2022 00:52 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ గురుకులాల్లో ..

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీ- జేఈఈ(మెయిన్‌/ అడ్వాన్స్‌డ్‌), నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్‌ టైం సబ్జెక్ట్‌ అసోసియేట్‌ ఖాళీల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

* పార్ట్‌ టైం సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌

మొత్తం పోస్టులు: 149

సబ్జెక్టులు-ఖాళీలు: గణితం- 26, భౌతికశాస్త్రం- 29, రసాయన శాస్త్రం- 32, వృక్షశాస్త్రం- 30, జంతుశాస్త్రం- 32.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ మెయిన్స్‌/ అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌ శిక్షణకు సంబంధించి టీచింగ్‌ అనుభవం.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 23.

రాత పరీక్ష తేదీ: 2022, జులై 31.

డెమో/ ఇంటర్వ్యూ తేదీ: 2022, ఆగస్టు 08.

www.tgtwgurukulam.telangana.gov.in/


సెబీలో ఆఫీసర్‌ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ (అసిస్టెంట్‌ మేనేజర్లు) - ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

మొత్తం పోస్టులు: 24

అర్హత: ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: ఫేజ్‌-1 (ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌), ఫేజ్‌-2 (మెయిన్‌ ఎగ్జామినేషన్‌), ఫేజ్‌-3 (ఇంటర్వ్యూ) ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌/ రంగారెడ్డి, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 31.

వెబ్‌సైట్‌: www.sebi.gov.in/


సైన్యంలో డెంటల్‌ కార్ప్స్‌

ఆర్మీ డెంటల్‌ కార్ప్స్‌ నియామకానికి సంబంధించి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి భారత సైన్యం ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

డెంటల్‌ కార్ప్స్‌: 30 (27 పురుషులు + 03 మహిళలు)

అర్హత: బీడీఎస్‌/ ఎండీఎస్‌ ఉత్తీర్ణత. ఎన్‌బీఈ నిర్వహించిన నీట్‌ ఎండీఎస్‌-2022 రాసి ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 14.

https://joinindianarmy.nic.in/


ప్రవేశాలు

నిమ్స్‌, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని నిమ్స్‌.కింది తెలిపిన బీపీటీ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అందిస్తున్న ప్రోగ్రాములు:

1. నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ(పారామెడికల్‌ అలైడ్‌ సైన్సెస్‌): 100 సీట్లు

విభాగాలు: అనస్థీషియా టెక్నాలజీ, డయాలసిస్‌ థెరపీ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్‌ టెక్నాలజీ తదితరాలు.

2. నాలుగున్నరేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ: 50 సీట్లు

3. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ (మహిళలకు మాత్రమే): 100 సీట్లు

అర్హత: బోటనీ/ జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.

వయసు: 31.12.2022 నాటికి 17 - 25 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 01.

దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేదీ: 2022, ఆగస్టు 04.

వెబ్‌సైట్‌: https://nims.edu.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని