Published : 21 Jul 2022 00:34 IST

నోటిఫికెషన్స్

ఉద్యోగాలు

టీహెచ్‌డీసీలో 109 ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న సంస్థ టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఇంజినీర్లు
మొత్తం పోస్టులు: 109 విభాగాలు: సివిల్‌, ఎల‌్రక్టికల్‌, మెకానికల్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, పవర్‌ ఎల‌్రక్టానిక్స్‌, ఎల‌్రక్టికల్‌ మెషిన్స్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 19.  వెబ్‌సైట్‌: https://thdc.co.in/


సీఐఐఎల్‌, మైసూర్‌లో....

మైసూరులోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌ (సీఐఐఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా (రీజియన్ల వారీగా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* రిసోర్స్‌ పర్సన్లు (టీచింగ్‌)
మొత్తం పోస్టులు: 40 అర్హత: సంబంధిత భాషలో ఎంఏ/ ఎంఏ (లిటరేచర్‌)/ ఎంఏ (లింగ్విస్టిక్స్‌) ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 26. వెబ్‌సైట్‌: www.ciil.org/


ఉమ్మడి తూర్పుగోదావరిలో 38 పోస్టులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 38 పోస్టులు: మెడికల్‌ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్‌ నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరాలు. అర్హతలు: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఎంబీబీఎస్‌, బీఎస్సీ, ఎమ్మెస్సీ, డిప్లొమా, పీజీడీసీఏ ఉత్తీర్ణత. ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ), కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 25.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/


ప్రవేశాలు
పీజేటీఎస్‌ఏయూలో డిప్లొమా ప్రోగ్రాములు

హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌)లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అందిస్తున్న కోర్సులు: డిప్లొమా (అగ్రికల్చర్‌), డిప్లొమా (ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌), డిప్లొమా (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌). అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో పాలీసెట్‌ 2022 పరీక్ష రాసి ఉండాలి. వయసు: 31.12.2022 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: పాలీసెట్‌ 2022 అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో సాధించిన మెరిట్‌ ర్యాంకు ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 13.

వెబ్‌సైట్‌: https://diploma.pjtsau.ac.in/

 


టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, హైదరాబాద్‌లో..

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న పీవీటీజీ (చెంచు, కోలం, తోటి, కొలవారి) ప్రతిభా కళాశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ. మీడియం: ఇంగ్లిష్‌ మీడియం. అర్హత: 2022 మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర గిరిజన బాల, బాలికలు అర్హులు. ఈ పీవీటీజీ ప్రతిభా కళాశాలల్లో సీటు పొందిన వారికి ఇంటర్‌తో పాటు జేఈఈ మెయిన్స్‌/ అడ్వాన్స్‌డ్‌, నీట్‌, క్లాట్‌/ సీఎంఏ, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 30.
వెబ్‌సైట్‌: https://tgtwgurukulam.telangana.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts