నోటిఫికేషన్స్‌

తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రజారోగ్య ప్రయోగశాలలో పోస్టుల నియామకానికి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.

Updated : 25 Jul 2022 04:37 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

టీఎస్‌పీఎస్సీ- 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు

తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రజారోగ్య ప్రయోగశాలలో పోస్టుల నియామకానికి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు, మొత్తం పోస్టులు: 24

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ డిగ్రీ (మెడిసిన్‌) ఉత్తీర్ణత.

వయసు: 01-07-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష (పేపర్‌ 1, పేపర్‌ 2), ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 29.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 26.

పరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌): నవంబర్‌, 2022.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/


యూపీఎస్సీ - 16 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 16

పోస్టులు: టెక్నికల్‌ అడ్వైజర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌, రీడర్‌, సీనియర్‌ లెక్చరర్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ/ ఎంఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 11.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


ప్రవేశాలు

టీఎస్‌పీఎస్సీ- ఆర్‌ఐఎంసీలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ)లో జులై 2023 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

అర్హత: ఏడో తరగతి చదువుతోన్న/ లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.

ఎంపిక: రాత పరీక్ష, వైవా వాయిస్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, అక్టోబరు 15.

పరీక్ష తేదీ: 2022, డిసెంబరు 03.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/


ఐకార్‌ - ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ 2022

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐకార్‌) ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఈఈఏ) 2022-23 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

యూజీ, పీజీ, జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) ప్రవేశాలు

అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 19.

వెబ్‌సైట్‌: https://icar.nta.nic.in/


జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) కింది కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫుల్‌ టైమ్‌ సెల్ఫ్‌ ఫైనాన్స్‌) 2022-23

అందిస్తున్న కోర్సులు: ఎంఎఫ్‌ఏ (అప్లైడ్‌ ఆర్ట్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌, పెయింటింగ్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌, ఫొటోగ్రఫీ అండ్‌ మీడియా కమ్యూనికేషన్‌, స్కల్ప్‌చర్‌).

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎఫ్‌ఏ ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేదీ: 2022, ఆగస్టు 23.

వెబ్‌సైట్‌: https://www.jnafau.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు