నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ఇంజినీరింగ్‌, జియో సైన్స్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 27 Jul 2022 01:45 IST

ఉద్యోగాలు
ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ఇంజినీరింగ్‌, జియో సైన్స్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు

విభాగాలు: జియాలజీ అండ్‌ జియోఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు

ఎంపిక: గేట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: వెల్లడించాల్సి ఉంది.

వెబ్‌సైట్‌: ‌www.ongcindia.com/


ఐఓసీఎల్‌లో లా ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 18. సీనియర్‌ లా ఆఫీసర్లు-09, లా ఆఫీసర్లు-09.

అర్హత: మూడేళ్ల/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: క్లాట్‌ 2022 పీజీ మెరిట్‌ ర్యాంక్‌, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 14.

వెబ్‌సైట్‌: https://iocl.com/


ప్రవేశాలు

ఎండీఎన్‌ఐవైలో యోగా కోర్సులు

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా(ఎండీఎన్‌ఐవై) 2022-23 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: డిప్లొమా (యోగా సైన్స్‌), బీఎస్సీ(యోగా), ఎమ్మెస్సీ (యోగా), పీజీ డిప్లొమా తదితరాలు.

అర్హత: సంబంధిత కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2), గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 05.

వెబ్‌సైట్‌: www.yogamdniy.nic.in/


అప్రెంటిస్‌షిప్‌

సింగరేణిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

ప్రభుత్వరంగ సంస్థ అయిన తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 1300 ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, మెకానిక్‌ డీజిల్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌, టర్నర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా. ఆన్‌రోల్‌ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యమిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 06.

వెబ్‌సైట్‌: https://scclmines.com/


ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 284 ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌) ఉత్తీర్ణత.

వయసు: 18.10.2022 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 08/ 2022, సెప్టెంబరు 12.

వెబ్‌సైట్‌: www.ecil.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని