Published : 28 Jul 2022 00:42 IST

ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టులో 85 పోస్టులు

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 85 టైపిస్టులు- 43, కాపీయిస్టులు- 42.

అర్హత: ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌/ లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌ హయ్యర్‌గ్రేడ్‌ టెక్నికల్‌ ఎగ్జామ్‌లో అర్హత.

వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఉమ్మడి రాత పరీక్ష, ఉమ్మడి టైప్‌రైటింగ్‌ టెస్ట్‌ (స్కిల్‌ టెస్ట్‌) ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఆగస్టు 10.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 25.

హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే తేదీ: 2022, సెప్టెంబరు 05.

పరీక్ష తేదీ: 2022, సెప్టెంబరు 25.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/


ఇండియన్‌ ఆర్మీలో 191 పోస్టులు

ఇండియన్‌ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ(ఓటీఏ) ఏప్రిల్‌ 2023 సంవత్సరానికి గాను 60వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) మెన్‌, 31వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌) ఉమెన్‌ కోర్సు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) మెన్‌/ ఉమెన్‌ (ఏప్రిల్‌ 2023) కోర్సు

మొత్తం ఖాళీలు: 191

విభాగాల వారీగా ఖాళీలు: ఎస్‌ఎస్‌సీ (టెక్‌) మెన్‌-175, ఎస్‌ఎస్‌సీ (టెక్‌) ఉమెన్‌-14, విడోస్‌ డిఫెన్స్‌ పర్సనల్‌-02.

విభాగాలు: సివిల్‌/ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 24.

వెబ్‌సైట్‌: http://joinindianarmy.nic.in/


ఎన్‌టీపీలో 23 పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) నిర్ణీత కాల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 23

విభాగాలు: కార్చన్‌ క్యాప్చర్‌ అండ్‌ యుటిలైజేషన్‌, హైడ్రోజన్‌, సివిల్‌ డిజైన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితరాలు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుల ప్రారంభం: 2022, జులై 29.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 12.

వెబ్‌సైట్‌:  https://www.ntpc.co.in/


సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో 45 పోస్టులు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సబ్సిడరీ సంస్థ అయిన సెంట్‌ బ్యాంక్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 45

పోస్టులు-ఖాళీలు: ఆఫీసర్లు-22, సీనియర్‌ ఆఫీసర్లు-16, జూనియర్‌ మేనేజర్లు-07.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుల ప్రారంభం: 2022, జులై 30.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 18.

వెబ్‌సైట్‌: https://www.cbhfl.com/


స్కాలర్‌షిప్‌

తపాలా శాఖ - స్పార్ష్‌ యోజన స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం

భారతీయ తపాలా శాఖ 2022-2023 సంవత్సరానికి దీన్‌ దయాళ్‌ స్పార్ష్‌ యోజన స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా స్టాంపుల సేకరణ హాబీ, పరిశోధనలో ప్రోత్సాహం కోసం తెలంగాణలోని ఆరో తరగతి - తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం స్కాలర్‌షిప్‌లు: 920 (ప్రతి పోస్టల్‌ సర్కిల్‌కు 40 స్కాలర్‌షిప్స్‌ అందజేస్తారు)

స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.6000 (నాలుగు త్రైమాసికాల్లో రూ.1500 చొప్పున) అందజేస్తారు.

అర్హత:  ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు. వీరికి మంచి అకడమిక్‌ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉండాలి.

ఎంపిక: ఫిలాటెలీ రిటన్‌ క్విజ్‌, ఫిలాటెలీ ప్రాజెక్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 26.

చిరునామా: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫిలాటెలీ), చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌, తెలంగాణ సర్కిల్‌, డాక్‌ సదన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-500001.

వెబ్‌సైట్‌: https://tsposts.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts