నోటిఫికేషన్స్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు, ఇతర బీ స్కూల్స్‌లో ఎంబీఏ కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్షే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌). ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

Published : 01 Aug 2022 00:52 IST

ప్రవేశాలు
క్యాట్‌-2022

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు, ఇతర బీ స్కూల్స్‌లో ఎంబీఏ కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్షే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌). ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)-2022

అర్హత: 50% మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహిస్తారు. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.2300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1150 చెల్లించాలి).

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: సెప్టెంబర్‌ 14.

పరీక్ష తేదీ: నవంబర్‌ 27

వెబ్‌సైట్‌: https://iimcat.ac.in/


ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో జులై 2023 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ బాలబాలికల నుంచి ఏపీపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.

ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

అర్హత: ఏడో తరగతి చదువుతోన్న లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.

వయసు: జులై 1, 2023 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, వైవా వాయిస్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్ష: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. మ్యాథమేటిక్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 15.

పరీక్ష తేదీ: డిసెంబర్‌ 03.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీలో 823 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు

విజయవాడలోని ప్రజారోగ్య, కటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌ కార్యాలయం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో పని చేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

మొత్తం పోస్టులు: 823

1. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో: 635 పోస్టులు,

2. ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో: 188 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 06.

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు

హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్‌ సర్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రవాణా విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు

మొత్తం పోస్టులు: 113

అర్హత: మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా (ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 21-39 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఆగస్టు 05 నుంచి సెప్టెంబర్‌ 05 వరకు.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/


స్కాలర్‌షిప్‌

పీఎం యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ స్కీమ్‌ ఫర్‌ వైబ్రంట్‌ ఇండియా (యశస్వి)

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పీఎం యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ స్కీమ్‌ ఫర్‌ వైబ్రంట్‌ ఇండియా (యశస్వి) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఓబీసీ, ఈబీసీ తదితర వర్గాలకు ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్‌ పథకం యశస్వి.

అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి లేదా పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష- యశస్వి ప్రవేశ పరీక్ష-2022 ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌.

పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌/ నాలెడ్జ్‌ సబ్జెక్ట్‌ల్లో ప్రశ్నలుంటాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 26.

పరీక్ష తేది: సెప్టెంబర్‌ 11.

వెబ్‌సైట్‌: https://yet.nta.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని