నోటిఫికేషన్స్‌

తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు(డీఏఓ) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Updated : 08 Aug 2022 01:27 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో..

తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు(డీఏఓ) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: (01.07.2022 నాటికి): 18- 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 17-08-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-09-2022.
రాత పరీక్ష: డిసెంబర్‌ 2022.
వెబ్‌సైట్‌:
www.tspsc.gov.in


ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో...

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని శాఖల్లో అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్‌: 50 పోస్టులు
2. అసిస్టెంట్‌ మేనేజర్‌: 30 పోస్టులు
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: (01.01.2022 నాటికి): 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.800
ఏపీ, తెలంగాణలోని ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.08.2022.
పరీక్షలు: సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2022.
వెబ్‌సైట్‌:
www.lichousing.com


1,681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌- హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన 1,681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ ఖాళీల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హతలు: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణత. లేదా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ కోర్సుతో బీఎస్సీ ఉత్తీర్ణత
వయసు: నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18- 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అయిదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక, పరీక్ష: ఆన్‌లైన్‌ రాతపరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికలుంటాయి. బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 9 నుంచి 22వ తేదీ వరకు.
రాత పరీక్ష: సెప్టెంబర్‌ మొదటి వారంలో.
వెబ్‌సైట్‌: 
https://cfw.ap.nic.in


ఆదర్శ పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన 71 టీజీటీ, 211 పీజీటీ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాథÅ]మ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు.

అర్హతలు: పీజీటీ ఖాళీలకు రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లైడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో బీఈడీ, తదితర ప్రొఫెషనల్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయసు పరిమితి 44 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ వారికి 49 ఏళ్లు.
ఎంపిక: జోన్‌, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.  డిగ్రీ, పీజీకి 60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో అతిథి అధ్యాపకులుగా చేసినవారికి 20 శాతం, టీచింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, టీచింగ్‌ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 17.
ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా ప్రకటన: ఆగస్టు 23
అభ్యంతరాల స్వీకరణ తేదీలు: ఆగస్టు 24 - 25
ఇంటర్వ్యూ జాబితా విడుదల: ఆగస్టు 29
వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణ: నవంబరు 8
ఎంపికైన అభ్యర్థుల జాయినింగ్‌ తేదీ: నవంబరు 9
వెబ్‌సైట్‌:
https://cse.ap.gov.in/DSE


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని