నోటిఫికేషన్స్‌

క్రీడా ప్రాధికార సంస్థ.. న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)  నేషనల్‌ సెంటర్స్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ రిసెర్చ్‌లో ఒప్పంద ప్రాతిపదికన హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 10 Aug 2022 02:53 IST

ఉద్యోగాలు

సాయ్‌లో హైపెర్ఫార్మెన్స్‌ అనలిస్టులు

క్రీడా ప్రాధికార సంస్థ.. న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)  నేషనల్‌ సెంటర్స్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ రిసెర్చ్‌లో ఒప్పంద ప్రాతిపదికన హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌: 138 పోస్టులు

* ఫిజియోథెరపిస్ట్‌- 42  

* స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ ఎక్స్‌పర్ట్‌- 42  

* ఫిజియాలజిస్ట్‌- 13

* సైకాలజిస్ట్‌- 13

* బయోమెకానిక్స్‌- 13

* న్యూట్రిషనిస్ట్‌- 13  

* బయోకెమిస్ట్‌- 02  

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ/ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్సైజ్‌ సైన్స్‌/ స్పోర్ట్స్‌ సైన్స్‌/స్పోర్ట్స్‌ కోచింగ్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ సైన్స్‌/ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ మెడికల్‌/ హ్యూమన్‌/ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ ఫిజియాలజీ/ లైఫ్‌ సైన్స్‌/ బయోలాజికల్‌ సైన్సెస్‌/ సైకాలజీ/ బయోమెకానిక్స్‌/ అండ్‌ డైటీషియన్‌/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ బయోకెమిస్ట్రీ/ కెమిస్ట్రీ విత్‌ బయోకెమిస్ట్రీ), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత, అదనపు విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.09.202.

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.gov.in/


బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సులో  323 ఏఎస్‌ఐ, హెచ్‌సీలు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)... అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టెనోగ్రాఫర్‌): 11

* హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌): 312  

మొత్తం ఖాళీలు: 323

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సీనియర్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌(10+2), ఇంగ్లిష్‌/ హిందీ షార్ట్‌హ్యాండ్‌, టైపింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.100.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2022.

వెబ్‌సైట్‌: https://bsf.gov.in/


నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో..

ఉమ్మడి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* అనస్తీషియా టెక్నీషియన్‌: 03 పోస్టులు

* ఆడియో విజువల్‌ టెక్నీషియన్‌: 01

* ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌: 03  

* బయో మెడికల్‌ ఇంజనీర్‌: 01  

* డెంటల్‌ హైజీనిస్ట్‌: 01

రేడియోగ్రాఫర్‌: 05  

* ఈసీజీ టెక్నీషియన్‌: 01  

* ఎలక్ట్రీషియన్‌: 05  

* జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు: 33

* ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 06

* ఆఫీస్‌ సబార్డినేట్‌: 10  

* ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌/ రిఫ్రాక్షనిస్ట్‌: 02

* ఆప్టోమెట్రిస్ట్‌: 01

* ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: 04

* ప్లంబర్‌: 02

* రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్‌: 01

* స్పీచ్‌ థెరపిస్ట్‌: 02  

* శానిటరీ వర్కర్‌ కమ్‌ వాచ్‌మెన్‌: 04

పోస్టులు మొత్తం ఖాళీలు: 85

అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.

వయసు: 42 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 20.08.2022.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in


ప్రభుత్వాసుపత్రుల్లో   పారా మెడికల్‌ పోస్టులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పారా మెడికల్‌, ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు.

* అనస్తీషియా టెక్నీషియన్‌: 06 పోస్టులు

* ఆడియోమెట్రీ టెక్నీషియన్‌: 04

* బయో మెడికల్‌ టెక్నీషియన్‌: 03  

* కౌన్సెలర్‌/ ఎంఎస్‌డబ్ల్యూ: 02  

* డెంటల్‌ టెక్నీషియన్‌: 03  

* రేడియోగ్రాఫర్‌: 11  

* ఈసీజీ టెక్నీషియన్‌: 06  

* ఎలక్ట్రీషియన్‌: 04

* ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌: 03

* జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు: 39

* మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌: 01

* ల్యాబ్‌ అటెండెంట్‌: 07

* ల్యాబ్‌ టెక్నీషియన్‌: 15  

* ఆఫీస్‌ సబార్డినేట్‌: 05

* ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2: 15  

* ఫిజియోథెరపిస్ట్‌: 02  

* ప్లంబర్‌: 06  

* శానిటరీ వర్కర్‌ కమ్‌ వాచ్‌మెన్‌: 13 పోస్టులు

మొత్తం ఖాళీలు: 144

అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తు, సంబంధిత ధ్రువపత్రాలను డీఎంహెచ్‌వో కార్యాలయం, శ్రీకాకుళం చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 20-08-2022.

వెబ్‌సైట్‌: https://srikakulam.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని