నోటిఫికెషన్స్

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా... దేశ వ్యాప్తంగా ఉన్న అలిమ్‌కో ప్రధాన, సహాయక ఉత్పత్తి, ప్రాంతీయ మార్కెటింగ్‌ కేంద్రాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

Updated : 11 Aug 2022 06:49 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

అలిమ్‌కోలో 76 జీఎం, మేనేజర్‌ పోస్టులు

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా... దేశ వ్యాప్తంగా ఉన్న అలిమ్‌కో ప్రధాన, సహాయక ఉత్పత్తి, ప్రాంతీయ మార్కెటింగ్‌ కేంద్రాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 76 జీఎం, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, పీజీడీఎం, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: పోస్టును అనుసరించి అకడమిక్‌ విద్యార్హత మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, టైపింగ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తు, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను మేనేజర్‌(అడ్మినిస్ట్రేషన్‌), అలిమ్‌కో, నరమౌ, జీటీ రోడ్డు, కాన్పూర్‌, యూపీ చిరునామాకు పోస్టు/ కొరియర్‌ ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 20.9.2022.

వెబ్‌సైట్‌ : https://www.alimco.in/ 


189 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీలు

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌... గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మెకానికల్‌, ఎల‌్రక్టికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెటలర్జీ, కెమికల్‌, కెమిస్ట్రీ, సివిల్‌, మైనింగ్‌.
అర్హత: 65% మార్కులతో బీఈ, బీటెక్‌(మెకానికల్‌/ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ టెలికాం/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌/ ఆర్కిటెక్చర్‌/ సిరామిక్స్‌ ఇంజినీరింగ్‌/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2022 మార్కులు సాధించి ఉండాలి.
వయసు: 11.09.2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-2022 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.09.2022.

వెబ్‌సైట్‌: https://nalcoindia.com/


వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
ఐఆర్‌సీటీసీలో 60 హాస్పిటాలిటీ మానిటర్‌ పోస్టులు

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఆర్‌సీటీసీ), సౌత్‌ సెంట్రల్‌ జోన్‌... నామినేటెడ్‌ మొబైల్‌/ స్టాటిక్‌ క్యాటరింగ్‌ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్‌ ఖాళీల భర్తీకి వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
హాస్పిటాలిటీ మానిటర్‌: 60 పోస్టులు

అర్హత: 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయసు: 01.08.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.
ఎంపిక: విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీలు, వేదికలు: 24.08.2022, 25.08.2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ దగ్గర, వీవీఎస్‌ నగర్‌, భువనేశ్వర్‌, ఒడిశా.
27.08.2022, 28.08.2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎఫ్‌-రో, విద్యానగర్‌, డీడీ కాలనీ, హైదరాబాద్‌, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://irctc.com/



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని