నోటిఫికేషన్స్‌

దిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  

Published : 15 Aug 2022 01:43 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

4300 ఎస్‌ఐ, సీఆర్‌పీఎఫ్‌ కొలువులు

దిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  

* దిల్లీ పోలీసు విభాగంలో ఎస్‌ఐ (పురుషులు): 228 పోస్టులు

* దిల్లీ పోలీసు విభాగంలో ఎస్‌ఐ (మహిళలు): 112 పోస్టులు

* సీఆర్‌పీఎఫ్‌లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌(జీడీ): 3960 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ  

వయసు: 01-01-2022 నాటికి 20- 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ / ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.08.2022.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 31.08.2022.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష షెడ్యూల్‌: నవంబర్‌, 2022.

వెబ్‌సైట్‌:https://ssc.nic.in/


స్పైసెస్‌ బోర్డులో ఎగ్జిక్యూటివ్‌లు

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన స్పైసెస్‌ బోర్డ్‌... కొచ్చిన్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీ కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎగ్జిక్యూటివ్‌(మార్కెటింగ్‌): 08 పోస్టులు

* ఎగ్జిక్యూటివ్‌(డెవలప్‌మెంట్‌): 11 పోస్టులు

* ట్రేడ్‌ అనలిస్ట్‌: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ(అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ), ఎంఎస్సీ(బోటనీ), ఎంఏ(ఎకనామిక్స్‌), ఎంబీఏ(మార్కెటింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: దరఖాస్తులను మొదట ఈ-మెయిల్‌ ద్వారా పంపాలి. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను సెక్రటరీ, స్పైసెస్‌ బోర్డ్‌, కొచ్చిన్‌, కేరళ చిరునామాకు 26.08.2022 లోగా పంపించాలి.

ఈ-మెయిల్‌:  hrdatp.sbnker@gov.in

ఈ-మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.08.2022.

వెబ్‌సైట్‌: http://www.indianspices.com/


ప్రకాశం జిల్లాలో పారా మెడికల్‌ పోస్టులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన 30 పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ దరఖాస్తులను కోరుతోంది.

* ఐసీటీసీ కౌన్సెలర్‌: 01 పోస్టు

* ల్యాబ్‌ టెక్నీషియన్‌: 14

*  మెడికల్‌ ఆఫీసర్‌: 04  

* డేటా మేనేజర్‌: 01 

* స్టాఫ్‌ నర్సులు: 08  

*  ఫార్మసిస్ట్‌: 02 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా లెప్రసీ ఎయిడ్స్‌ అండ్‌ టీబీ అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 24-08-2022.

వెబ్‌సైట్‌:  https://prakasam.ap.gov.in/


పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్లు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన 23 పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ దరఖాస్తులను కోరుతోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు: 03 పోస్టులు

* స్టాఫ్‌ నర్స్‌: 06 పోస్టులు

* కౌన్సెలర్లు: 03 పోస్టులు

* ల్యాబ్‌ టెక్నీషియన్‌: 07 పోస్టులు

* ఫార్మాసిస్ట్‌: 03 పోస్టులు

* కమ్యూనిటీ కేర్‌ కోఆర్డినేటర్‌: 01 పోస్టు

అర్హతలు: ఇంటర్మీడియట్‌, ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణత.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్‌, పాత ట్రెజరీ కార్యాలయం, ఏలూరులో వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 20-08-2022.

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు