Published : 16 Aug 2022 01:10 IST

నోటిఫికేషన్స్‌

ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జేఈ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్‌(జేఈ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా/ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు వీటికి పోటీ పడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు కేంద్రప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. వీరికి లెవెల్‌ 6 పేస్కేల్‌ ప్రకారం వేతనాలు అందుతాయి.

అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) లేదా తత్సమాన డిగ్రీ చదివినవారు అర్హులు.

వయసు: 18-32 ఏళ్ల మధ్య ఉండాలి.

పరీక్ష: రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌-1ను ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌-2 ఆఫ్‌లైన్‌లో డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లు చెల్లించనవసరం లేదు).

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 02.09.2022.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03.09.2022.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (పేపర్‌-1)షెడ్యూల్‌: నవంబర్‌, 2022.

ఆఫ్‌లైన్‌ పరీక్ష (పేపర్‌-2): తేదీని తరువాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in


బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సులో...

సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌).. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో 1312 హెడ్‌ కానిస్టేబుల్‌ (ఆర్‌వో, ఆర్‌ఎం) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతి, 10+2 (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌), ఐటీఐ (రేడియో అండ్‌ టెలివిజన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, డేటా ప్రిపరేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫిట్టర్‌, ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్క్‌ టెక్నీషియన్‌, మెకట్రానిక్స్‌).

వయసు (19-09-2022 నాటికి): 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 20-08-2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-09-2022.

వెబ్‌సైట్‌: https://bsf.gov.in


అనంతపురం జిల్లాలో పారా మెడికల్‌ పోస్టులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన కింది 22 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.

* ఐసీటీసీ కౌన్సెలర్‌: 03 పోస్టులు
* ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 06
* మెడికల్‌ ఆఫీసర్‌: 03 * స్టాఫ్‌ నర్స్‌: 05  
* కౌన్సెలర్‌ ఆర్ట్‌: 01 * ఎస్‌టీఐ కౌన్సెలర్‌: 01  
* బ్లడ్‌ బ్యాంక్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 01
* బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్‌ డ్రైవర్‌: 01  
* బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్‌ అటెండర్‌: 01 పోస్టు

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ అండ్‌ టీబీ ఆఫీసర్‌ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపించాలి.

ఎంపిక: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తులకు చివరి తేదీ: 22-08-2022.

కౌన్సెలింగ్‌ నిర్వహణ తేదీ: 05-09-2022.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in


నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో గెస్ట్‌ టీచర్‌లు

నెల్లూరు, తిరుపతి జిల్లాల ఐటీడీఏ పరిధిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన అతిథి ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

1. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌: 27 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఎకనామిక్స్‌, బోటనీ, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.

2. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌: 36 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, గణితం, సైన్స్‌, సోషల్‌.

3. హాస్టల్‌ వార్డెన్‌: 03 పోస్టులు

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: విద్యార్హత మార్కులు, సీటెట్‌ మార్కులు, అదనపు అర్హతలు, పని అనుభవం, ఇంగ్లిష్‌ మీడియం చదువు, డెమో, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తులకు చివరి తేదీ: 18.08.2022.

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in


తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్లు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ దరఖాస్తులను కోరుతోంది.
* ఏఆర్‌టీ మెడికల్‌ ఆఫీసర్‌: 03 పోస్టులు
* ఏఆర్‌టీ స్టాఫ్‌ నర్స్‌: 03  
* ఎల్‌ఏసీ ప్లస్‌ స్టాఫ్‌ నర్స్‌: 02
* ఏఆర్‌టీ కౌన్సెలర్‌: 03  
* ఏఆర్‌టీ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 02  
* ఏఆర్‌టీ ఫార్మసిస్ట్‌: 01 పోస్టు

అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, కాకినాడ, కాకినాడ జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 19-08-2022.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని