నోటిఫికేషన్స్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి(గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌), గ్రేడ్‌ డి(గ్రూప్‌ సి) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.   

Published : 22 Aug 2022 00:44 IST

ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి(గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌), గ్రేడ్‌ డి(గ్రూప్‌ సి) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.   

ఖాళీలు: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్య నిర్ణీత సమయంలో వెల్లడిస్తారు.

అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులే దరఖాస్తుకు అర్హులు.

వయసు: 01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్‌ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్టెనోగ్రఫీలో స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రెహెన్షన్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి.

దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, దివ్యాంగులు రుసుము ఉండదు.

ఏపీ, తెలంగాణల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: 05.09.2022

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష షెడ్యూల్‌: నవంబర్‌, 2022.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


గెయిల్‌లో 282 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌లు

న్యూదిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్‌ సెంటర్లు/ యూనిట్‌లలో 282 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

జూనియర్‌ ఇంజినీర్‌(కెమికల్‌): 2 పోస్టులు * జూనియర్‌ ఇంజినీర్‌(మెకానికల్‌): 1 * ఫోర్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌): 1 * ఫోర్‌మ్యాన్‌(ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 14 * ఫోర్‌మ్యాన్‌ (మెకానికల్‌): 1 * ఫోర్‌మ్యాన్‌ (సివిల్‌): 1 * జూనియర్‌ సూపరింటెండెంట్‌ (అధికారిక భాష): 5 * జూనియర్‌ సూపరింటెండెంట్‌ (హెచ్‌ఆర్‌): 20 * జూనియర్‌ కెమిస్ట్‌: 8 * టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ల్యాబొరేటరీ): 3 * ఆపరేటర్‌ (కెమికల్‌): 29 * టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్‌): 35 * టెక్నీషియన్‌(ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 16 * టెక్నీషియన్‌ (మెకానికల్‌): 38 * టెక్నీషియన్‌ (టెలికాం అండ్‌ టెలిమెట్రీ): 14 * ఆపరేటర్‌ (ఫైర్‌): 23 * అసిస్టెంట్‌ (స్టోర్‌ అండ్‌ పర్చేజ్‌): 28 * అకౌంట్స్‌ అసిస్టెంట్‌: 24 * మార్కెటింగ్‌ అసిస్టెంట్‌: 19 పోస్టులు

అర్హతలు: పోస్టును బట్టి పదోతరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.50.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుకు చివరి తేదీ: 15.09.2022.

వెబ్‌సైట్‌: https://gailonline.com/


ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ కొలువులు

యూపీ రాష్ట్రం ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌... శాశ్వత ప్రాతిపదికన 13 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 60% మార్కులతో డిప్లొమా ఇంజినీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌) ఉత్తీర్ణత.

వయసు: 31.07.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.295.

ఎంపిక: రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.09.2022.

వెబ్‌సైట్‌: https://www.belnindia.in/


అణు పరిశోధనా కేంద్రంలో నర్సు పోస్టులు

అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌... ముంబయి, హరియాణా, కోల్‌కతాల్లోని బార్క్‌ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* నర్సు-ఎ: 13 పోస్టులు
* సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి(పాథాలజీ): 02 పోస్టులు
* సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి(న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌): 08 పోస్టులు
* సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-సి(మెడికల్‌ సోషల్‌ వర్కర్‌): 01 పోస్టు
* సబ్‌ ఆఫీసర్‌-బి: 04 పోస్టులు
* సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి(సివిల్‌): 08 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 36

అర్హతలు: పోస్టును అనుసరించి పన్నెండో తరగతి, బీఎస్సీ(నర్సింగ్‌), బీఎస్సీ డీఎంఎల్‌టీ, పీజీ (మెడికల్‌ సోషల్‌ వర్క్‌), డిప్లొమా(సివిల్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12.09.2022.

వెబ్‌సైట్‌: https://barc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని