నోటిఫికేషన్స్‌

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ 420 మెడికల్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి వైద్య అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 23 Aug 2022 00:59 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో..

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ 420 మెడికల్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి వైద్య అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు (పురుషులు- 378, మహిళలు- 42).

అర్హత: ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌

వయసు: 31-12-2022 నాటికి ఎంబీబీఎస్‌ అభ్యర్థులు 30 సంవత్సరాలు, పీజీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.200

ఎంపిక: ఇంటర్వ్యూ, ఫిజికల్‌, మెడికల్‌ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2022.

ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ: 27-09-2022

ఇంటర్వ్యూ వేదిక: ఆర్మీ హాస్పిటల్‌ (ఆర్‌ అండ్‌ ఆర్‌), దిల్లీ కంటోన్మెంట్‌.

వెబ్‌సైట్‌: https://amcsscentry.org/


ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌(ఇన్‌కాయిస్‌).. ఒప్పంద ప్రాతిపదికన 138 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 

* ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-3: 09 పోస్టులు * ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-2: 23 * ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1: 59 * ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 36 * ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 06 * ఎక్స్‌పర్ట్‌/ కన్సల్టెంట్‌: 05 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ(టెక్‌), ఎంఎఫ్‌ఎస్‌సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-09-2022.

వెబ్‌సైట్‌: http://www.incois.gov.in/


99 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

హరియాణా రాష్ట్రం కురుక్షేత్రలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వివిధ విభాగాల్లో 99 అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ గ్రేడ్‌-1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌...తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.09.2022.

వెబ్‌సైట్‌: https://nitkkr.ac.in/


ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీలో 14 కొలువులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాన్పూర్‌కు చెందిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టోర్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఇంజినీర్‌, మేనేజర్‌ తదితరాలు.

విభాగాలు: అడ్మిన్‌, డిజైన్‌, ప్రొడక్షన్‌, మెయింటెనెన్స్‌, ట్రెయినింగ్‌, మెకానికల్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ పీజీ డిప్లొమా/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎంబీఏ/ పీజీడీబీఎం/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.

వయసు: 30-45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: ది మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఇండో డానిష్‌ టూల్‌రూం, జమ్‌షెడ్‌పూర్‌, ఎం-4 (పార్ట్‌), ఫేజ్‌-4, టాటా కంద్ర రోడ్‌, పీవో-గంహరియా, జంషెడ్‌పూర్‌-832108.

దరఖాస్తుకు చివరి తేదీ: 26.09.2022.

వెబ్‌సైట్‌: https://www.idtr.gov.in/#


అప్రెంటిస్‌షిప్‌
ఐఆర్‌ఈఎల్‌ ఇండియా లిమిటెడ్‌లో...

ఒడిశా రాష్ట్రంలోని ఐఆర్‌ఈఎల్‌ ఇండియా లిమిటెడ్‌, ఓస్కోమ్‌ యూనిట్‌.. 103 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌(మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ కెమికల్‌): 44 ఖాళీలు
* టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ సివిల్‌): 31 ఖాళీలు
* ట్రేడ్‌ అప్రెంటిస్‌(ల్యాబ్‌ అసిస్టెంట్‌/ ఎగ్జిక్యూటివ్‌-హెచ్‌ఆర్‌/ ఎగ్జిక్యూటివ్‌- మార్కెటింగ్‌/ ఎగ్జిక్యూటివ్‌- కంప్యూటర్‌ సైన్స్‌/ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌/ ఏవోసీపీ): 23 ఖాళీలు
* ఆప్షనల్‌ ట్రేడ్‌ (వేర్‌హౌస్‌ ఎగ్జిక్యూటివ్‌/ స్టోరేజ్‌ అండ్‌ ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్‌/ అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌): 05 ఖాళీలు'

అర్హత: పోస్టును బట్టి పది, పన్నెండో తరగతి, బీఈ, బీటెక్‌, డిప్లొమా, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ అండ్‌ ఎ), ఓస్కోమ్‌, ఐఆర్‌ఈఎల్‌ ఇండియా లిమిటెడ్‌, గంజాం, ఒడిశా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-08-2022.

వెబ్‌సైట్‌: https://www.irel.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని