నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ), మెడికల్‌ కాలేజీ ఒప్పంద ప్రాతిపదికన 169 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 30 Aug 2022 00:55 IST

ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీలో 169 ఫ్యాకల్టీ, స్పెషలిస్ట్‌లు

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ), మెడికల్‌ కాలేజీ ఒప్పంద ప్రాతిపదికన 169 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రొఫెసర్‌: 09 పోస్టులు * అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 22, * అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 35, * సీనియర్‌ రెసిడెంట్‌: 73 * స్పెషలిస్ట్‌: 13 * సూపర్‌ స్పెషలిస్ట్‌: 14 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, బోధనానుభవం. దరఖాస్తు రుసుము: రూ.1000.

వయసు: 26-07-2022 నాటికి ఫ్యాకల్టీకి 69 ఏళ్లు, సూపర్‌ స్పెషలిస్టుకు- 69 ఏళ్లు, స్పెషలిస్టుకు- 66 ఏళ్లు, సీనియర్‌ రెసిడెంట్‌కు- 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ క్వాలిఫికేషన్‌ మార్కులు, టీచింగ్‌ అనుభవం, నీట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08.09.2022.

ఇంటర్వ్యూలు ప్రారంభం: 13.09.2022.

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/


విమ్స్‌లో 69 పారా మెడికల్‌ పోస్టులు

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఒప్పంద ప్రాతిపదికన 69 పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, విశాఖపట్నం చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 10-09-2022.

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/


అప్రెంటిస్‌
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

కేరళ రాష్ట్రం, కొచ్చిలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), కొచ్చి రిఫైనరీ 102 వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ మొదటి శ్రేణి ఉత్తీర్ణత.

వయసు: 01-09-2022 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.25,000.

శిక్షణ వ్యవధి: ఏడాది.

శిక్షణ స్థానం: బీపీసీఎల్‌, కొచ్చి రిఫైనరీ.

ఎంపిక: విద్యార్హత డిగ్రీ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 08-09-2022

బీపీసీఎల్‌ పోర్టల్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 13-09-2022

వెబ్‌సైట్‌: https://www.bharatpetroleum.in/


తిరుచ్చి భెల్‌లో 575 అప్రెంటిస్‌ ఖాళీలు

మిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (భెల్‌) వివిధ విభాగాల్లో 575 ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: పదోతరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి (01-08-2022 నాటికి): 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: అర్హత పరీక్ష మార్కులు, అసెస్‌మెంట్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-09-2022.

వెబ్‌సైట్‌: https://trichy.bhel.com/ tms/app_pro/index.jsp


వాక్‌ ఇన్‌
10 రిసెర్చ్‌ ఫెలో ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐకార్‌ ఆధ్వర్యంలోని పశ్చిమగోదావరి-ఏపీకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చ్‌(ఐఐఓపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 10,

* సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో.

విభాగాలు: అగ్రికల్చర్‌/ బయోటెక్నాలజీ/ హార్టికల్చర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ ఉత్తీర్ణత. నెట్‌ పరీక్ష అర్హత సాధించాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.31000 చెల్లిస్తారు.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: సంబంధిత ధ్రువ పత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ తేదీ: 22.09.2022.

వెబ్‌సైట్‌: https://iiopr.icar.gov.in/opportunities.php


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని