నోటిఫికేషన్స్

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 31 Aug 2022 06:03 IST

ఉద్యోగాలు


ఏఏఐ-చెన్నైలో 156 అసిస్టెంట్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 156
* పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌.
విభాగాలు: ఫైర్‌ సర్వీస్‌, అకౌంట్స్‌, అఫీషియల్‌ లాంగ్వేజ్‌.
అర్హతలు:
1. జూనియర్‌ అసిస్టెంట్‌: 10వ తరగతి, డిప్లొమా(మెకానికల్‌/ ఆటోమొబైల్‌/ ఫైర్‌)/ కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత.

* డ్రెవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి.
వేతన శ్రేణి: రూ.31000 - రూ.92000.
2. సీనియర్‌ అసిస్టెంట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ మాస్టర్స్‌ డిగ్రీ(హిందీ/ ఇంగ్లిష్‌) ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం రెండేళ్లు తప్పనిసరి.  
వేతన శ్రేణి: రూ.36000-రూ.1,10,000
వయసు: 18-30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుల ప్రారంభం: 01.09.2022 నుంచి.
దరఖాస్తు చివరి తేదీ: 30.09.2022.

వెబ్‌సైట్‌: https://www.aai.aero/en/recruitment/release/284246


రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హరియాణాలోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌(రైట్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ఇంజినీర్‌ (ఎల‌్రక్టికల్‌): 15 పోస్టులు
2. ఇంజినీర్‌ (మెకానికల్‌): 05 పోస్టులు
అర్హత: బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌) డిగ్రీ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఇండస్ట్రియల్‌/ ఆటోమొబైల్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా..
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 19.09.2022.

వెబ్‌సైట్‌: https://www.rites.com/


ఎన్‌సీడీఐఆర్‌-బెంగళూరులో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీడీఐఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 28
పోస్టులు: ప్రాజెక్టు సైంటిస్ట్‌లు, రిసెర్చ్‌ అసోసియేట్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్లు, ప్రాజెక్టు టెక్నికల్‌ ఆఫీసర్లు, ప్రాజెక్టు సీనియర్‌, అడ్మిన్‌ అసిస్టెంట్‌లు తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 12వ తరగతి/ డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వేతన శ్రేణి: రూ.17,000 - రూ.72,325.
వయసు: 25-40 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: adm.ncdir@gov.
దరఖాస్తు చివరి తేదీ: 12.09.2022
వెబ్‌సైట్‌: https://ncdirindia.org/


ప్రవేశాలు


ఆర్‌జీయూకేటీ-ఏపీలో ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ) 2022-23 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
పీయూసీ అండ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ 2022-23
అర్హత: ఎస్‌ఎస్‌సీ(10వ తరగతి)/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: ఆరు సంవత్సరాలు.
ఎంపిక: పదో తరగతిలో సాధించిన మార్కులు, ఆర్‌జీయూకేటీ నిబంధనల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.250.
దరఖాస్తు చివరి తేదీ: 19.09.2022.

వెబ్‌సైట్‌: https://rgukt.in/RGUKTAdmissions/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని