ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో 23 సీడీపీవో, ఐసీడీఎల్ అదనపు ప్రాజెక్టు అధికారి, అదనపు సీడీపీవో, ఐసీడీఎస్ గోదాముల మేనేజరు ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
మహిళా శిశు సంక్షేమశాఖలో..
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో 23 సీడీపీవో, ఐసీడీఎల్ అదనపు ప్రాజెక్టు అధికారి, అదనపు సీడీపీవో, ఐసీడీఎస్ గోదాముల మేనేజరు ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ (హోమ్ సైన్స్/ సోషల్ వర్క్/ సోషియాలజీ), లేదా బీఎస్సీ (ఆనర్స్- ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), లేదా బీఎస్సీ(ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (క్లినికల్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/ బోటనీ అండ్ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ), బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అండ్ బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
వయసు: 1-07-2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.200.
ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13-09-2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-10-2022.
పరీక్ష తేదీ: డిసెంబర్, 2022.
వెబ్సైట్: www.tspsc.gov.in/website
ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్
మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైనీ): 04 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్
2. టెక్నీషియన్: 17 పోస్టులు
విభాగాలు: మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్
అర్హత: ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 01.06.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.295.
ఆన్లైన్ దరఖాస్తు గడువు: 23.09.2022.
వెబ్సైట్: www.bel-india.in/
అప్రెంటిస్
హెచ్ఏఎల్లో 82 అప్రెంటిస్లు
హైదరాబాద్లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కింది విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 26 పోస్టులు
2. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: 34 పోస్టులు
3. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 22 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేదీలు: 12, 13, 14-09-2022.
వేదిక: ఆడిటోరియం, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వెనుక, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, హైదరాబాద్, బాలానగర్, హైదరాబాద్.
వెబ్సైట్: http://portal.mhrdnats.gov.in/
ప్రవేశాలు
నవోదయల్లో ప్రవేశాలు
దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయసు: 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశపరీక్ష: గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష తేదీ, వేదిక: 11-02-2023, సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాలు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022.
వెబ్సైట్: https://navodaya.gov.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్