Updated : 12 Sep 2022 06:27 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

540 ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టెనోగ్రాఫర్‌): 122 పోస్టులు (పురుషులు- 94, మహిళలు- 10, డిపార్ట్‌మెంటల్‌- 18) * హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌): 418 పోస్టులు (పురుషులు- 319, మహిళలు- 36, డిపార్ట్‌మెంటల్‌- 63)
మొత్తం ఖాళీలు: 540
అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సీనియర్‌ సెకండరీ స్కూల్‌ (10+2) సర్టిఫికెట్‌ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2022.
వెబ్‌సైట్‌: 
https://cisfrectt.in/


అసిస్టెంట్‌ మేనేజర్‌ కొలువులు

న్యూదిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ 37 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలు (డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు) మించకూడదు.
పరీక్ష ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200)
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03.10.2022.
వెబ్‌సైట్‌:
https://spmcil.com/


ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకులో...  

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ న్యూదిల్లీలోని ప్రధాన కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో రెగ్యులర్‌/ ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,  సీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150).
ఎంపిక: ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్‌ లేదా ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2022.
వెబ్‌సైట్‌:
https://www.ippbonline.com/


నాబార్డులో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ దేశవ్యాప్తంగా నాబార్డ్‌ శాఖల్లో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌: 173 పోస్టులు
* డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌(హిందీ): 04 పోస్టులు
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01-09-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 15-09-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022.
వెబ్‌సైట్‌: 
https://www.nabard.org/


ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌లో...  

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ 44 సైంటిస్ట్‌-బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: బయోటెక్నాలజీ, బోటనీ, సెల్యులోజ్‌ అండ్‌ పేపర్‌, కెమిస్ట్రీ, ఫారెస్ట్‌ ఎకాలజీ, ఎంటమాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఫారెస్ట్రీ, జెనెటిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పాథాలజీ, సాయిల్‌ సైన్స్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2022.
వెబ్‌సైట్‌:
https://www.icfre.org/recruitment


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని