Published : 13 Sep 2022 01:38 IST

నోటిఫికేషన్స్‌

ప్రభుత్వ ఉద్యోగాలు
పీఆర్‌ఎల్‌-అహ్మదాబాద్‌లో 17 ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ(పీఆర్‌ఎల్‌) 17 అసిస్టెంట్‌, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత:

1. అసిస్టెంట్‌: గ్రాడ్యుయేషన్‌(ఆర్ట్స్‌/ కామర్స్‌/ మేనేజ్‌మెంట్‌/ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌) ఉత్తీర్ణత.
2. జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌: గ్రాడ్యుయేషన్‌(ఆర్ట్స్‌/ కామర్స్‌/ మేనేజ్‌మెంట్‌/ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌)/ డిప్లొమా ఉత్తీర్ణత.

* ఇంగ్లిష్‌ స్టెనోగ్రాఫీ టైపింగ్‌లో నైపుణ్యం ఉండాలి.

వయసు: 18-26 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.250.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 01.10.2022

వెబ్‌సైట్‌: https://www.prl.res.in/prlneng/job_vacancies


బీజీసీఎల్‌-కోల్‌కతాలో 39 అసోసియేట్‌లు

భారత ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఆధ్వర్యంలోని కోల్‌కతాకు చెందిన బెంగాల్‌ గ్యాస్‌ కంపెనీ లిమిటెడ్‌(బీజీసీఎల్‌) 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ అసోసియేట్‌, అసిస్టెంట్‌ అసోసియేట్‌, అసోసియేట్‌ కంపెనీ సెక్రటరీ, సీనియర్‌ అసోసియేట్‌, చీఫ్‌ అసోసియేట్‌ పోస్టులు.

విభాగాలు: మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, లా తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ ఎంబీఏ/ పీబీడీఎం/ ఎంఎంఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 56 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మార్కులు, స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.200.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 28.09.2022

వెబ్‌సైట్‌: https://online.apscrecruitment.in/bgcl/#/login


మజగావ్‌డాక్‌-ముంబయిలో 1041 పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ముంబయి) 1041 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, పైప్‌ ఫిట్టర్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, రిగ్గర్‌, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌, స్టోర్‌ కీపర్‌, ఫార్మసిస్ట్‌, పారామెడిక్స్‌, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇన్‌స్పెక్టర్‌, సెయిల్‌ మేకర్‌ తదితరాలు.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ రేడియో మెకానిక్‌, రాడార్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌/ టెలివిజన్‌ (వీడియో) మెకానిక్‌/ మెకానిక్‌ కమ్‌- ఆపరేటర్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌/ మెకానిక్‌ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

* నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 18-38 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, పని అనుభవం ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 30.09.2022.

వెబ్‌సైట్‌: https://mazagondock.in/CareernNonnExecutives.aspx


యూపీఎస్సీ-54 వివిధ కొలువులు

కేంద్ర కార్మిక, ఉపాధి, హోం వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖల్లో 54 పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.09.2022.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


బనారస్‌ హిందూ వర్సిటీలో టీచింగ్‌ పోస్టులు

వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీల సంఖ్య: 18

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఐయూసీటీఈ, సుందర్‌బాగియా, నరియా బీఎల్‌డబ్ల్యూ రోడ్‌, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి 221005, యూపీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.09.2022.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08.10.2022.

వెబ్‌సైట్‌: http://www.iucte.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని