నోట్చిఫికేషన్స్‌

తెెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) 833 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Sep 2022 00:42 IST

ఉద్యోగాలు
833 ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌లు

తెెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) 833 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌ ఇంజినీర్‌-434, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-399
విభాగాలు: పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, పబ్లిక్‌హెల్త్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఇరిగేషన్‌ తదితరాలు.
అర్హత: 1. అసిస్టెంట్‌ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 18-44 ఏళ్లు ఉండాలి.
2. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18-44 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 28.09.2022 నుంచి 21.10.2022.వరకు స్వీకరిస్తారు.
వెబ్‌సైట్‌: 
https://tspsc.gov.in


165 రిసెర్చ్‌ సిబ్బంది కొలువులు

ఇండియా మెటీయొరొలాజికల్‌ (న్యూదిల్లీ) విభాగం 165 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌), సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)
విభాగాలు: వెదర్‌ అండ్‌ క్లైమెట్‌ సర్వీసెస్‌, ఏవియేషన్‌ మెటీయొరొలాజికల్‌ సర్వీసెస్‌ తదితరాలు.
అర్హత:
1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ బీఈ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత. వయసు: 35-45 ఏళ్లు ఉండాలి.
2. జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 09.10.2022
వెబ్‌సైట్‌: 
https://internal.imd.gov.in/pages/recruits_mausam.php


ఐఓసీఎల్‌లో 56 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అటెండెంట్‌ పోస్టులు.
విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, గ్రేడ్‌ 4, ఆపరేషన్స్‌.
అర్హత:
1. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
2. టెక్నికల్‌ అటెండెంట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్‌/ 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18-26 ఏళ్లు ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.100. దరఖాస్తు చివరి తేదీ: 10.10.2022.
వెబ్‌సైట్‌: 
https://iocl.com/latestnjobnopening


నీతి ఆయోగ్‌లో 28 ఉద్యోగాలు

నీతి ఆయోగ్‌ ఒప్పంద ప్రాతిపదికన 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: కన్సల్టెంట్‌ గ్రేడ్‌-1, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.
అర్హత:
1. కన్సల్టెంట్‌ గ్రేడ్‌-1: బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ ఎల్‌ఎల్‌బీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (సైన్స్‌/ ఎకనామిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఆపరేషన్‌ రిసెర్చ్‌/ పబ్లిక్‌ పాలసీ/ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌/ బిజినెస్‌ అడ్మిన్‌/ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణత. పని అనుభవం: కనీసం 3-8 ఏళ్లు ఉండాలి. వయసు: 45 ఏళ్లలోపు ఉండాలి.
2. యంగ్‌ ప్రొఫెషనల్‌: బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ ఎల్‌ఎల్‌బీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (సైన్స్‌/ ఎకనామిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఆపరేషన్‌ రిసెర్చ్‌/ పబ్లిక్‌ పాలసీ/ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌/ బిజినెస్‌ అడ్మిన్‌/ మేనేజ్‌మెంట్‌)

ఉత్తీర్ణత పని అనుభవం: కనీసం ఏడాది ఉండాలి. వయసు: 32 ఏళ్లలోపు ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: 
https://www.niti.gov.in/career/vacancyncircular


ఐఎస్‌పీ-నాసిక్‌రోడ్‌లో 16 ఖాళీలు

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని నాసిక్‌రోడ్‌లో ఉన్న ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌ (ఐఎస్‌పీ) 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: వెల్ఫేర్‌ ఆఫీసర్‌-01, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-15.
అర్హత:
1. వెల్ఫేర్‌ ఆఫీసర్‌: డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు వయసు ఉండాలి. పని అనుభవం: కనీసం రెండేళ్లు ఉండాలి.
2. జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వయసు: 28 ఏళ్లు వయసు ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600 ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 10.10.2022.

వెబ్‌సైట్‌: https://ispnasik.spmcil.com/Interface/JobOpenings.aspx?menue=5


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని