నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) 150 ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్ట్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 15 Sep 2022 00:29 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

భెల్‌లో 150 ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) 150 ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్ట్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఐటీ/ కంప్యూటర్స్‌, ఎలక్ట్రికల్స్‌, కెమికల్‌, మెటలర్జీ, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, మెకట్రానిక్స్‌, పవర్‌ ప్లాంట్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత:

1. ఇంజినీర్‌ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ/ డ్యుయల్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 27-29 ఏళ్లు మించకూడదు.

2. ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.

వయసు: 29 ఏళ్లు మించకూడదు.

* ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.10.2022.

పరీక్ష తేదీలు: 31.10.2022, 01, 02.11.2022.

వెబ్‌సైట్‌: https://careers.bhel.in/


బీఈసీఐఎల్‌-న్యూదిల్లీలో...

న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిడెట్‌ (బీఈసీఐఎల్‌) ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) దిల్లీలో పని చేయటానికి తాత్కాలిక ప్రాతిపదికన 22 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ డైటీషియన్‌, పర్‌ఫ్యూషనిస్ట్‌, లైబ్రేరియన్‌.

అర్హత:

1. అసిస్టెంట్‌ డైటీషియన్‌: ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు 40 ఏళ్లు మించకూడదు. 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

2. పర్‌ఫ్యూషనిస్ట్‌: బీఎస్సీ ఉత్తీర్ణత.

వయసు 40 ఏళ్లు మించకూడదు.

3. లైబ్రేరియన్‌: బీఎస్సీ/ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు 40 ఏళ్లు మించకూడదు. 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.09.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/


అప్రెంటిస్‌

ఇండియన్‌ నేవీలో 230 ఖాళీలు

భారత నౌకాదళానికి చెందిన కేరళ రాష్ట్రం కొచ్చిలోని నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌, నావల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ యార్డ్‌ 230 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: సీవోపీఏ, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, టర్నర్‌, వెల్డర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రోప్లేటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌ డీజిల్‌, మెరైన్‌ ఇంజిన్‌, షిప్‌రైట్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు (30-01-2023 నాటికి): 21 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌(ఆఫీసర్‌-ఇన్‌-ఛార్జ్‌), అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌, నేవల్‌ రిపేర్‌ యార్డ్‌, నేవల్‌ బేస్‌, కొచ్చి చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 23-09-2022.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


చాందీపూర్‌ ఐటీఆర్‌లో ....

ఒడిశా రాష్ట్రం చాందీపూర్‌లోని డీఆర్‌డీవోకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ 58 గ్రాడ్యుయేట్‌ అండ్‌ టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 32 ఖాళీలు

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌: 26 ఖాళీలు

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎల్‌ఐఎస్సీ, బీబీఏ, బీకాం, డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు డైరెక్టర్‌, ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌, చాందీపూర్‌, బాలాసోర్‌, ఒడిశా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2022.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని