నోటిఫికేషన్స్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ లెవల్‌(సీజీఎల్‌) పరీక్ష-2022 ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్రమంత్రిత్వ శాఖల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Published : 19 Sep 2022 01:00 IST

ఉద్యోగాలు


కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ లెవల్‌ ఎగ్జామ్‌-2022

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ లెవల్‌(సీజీఎల్‌) పరీక్ష-2022 ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్రమంత్రిత్వ శాఖల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* మొత్తం ఖాళీల సంఖ్య: 20,000
విద్యార్హతలు: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ పీజీ డిగ్రీ (కామర్స్‌/ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌)/ ఎంబీఏ (ఫైనాన్స్‌) అర్హత ఉండాలి. ఎంపిక: టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌, ఫిజికల్‌/ మెడికల్‌ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 08.10.2022.
ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 09.10.2022.
టైర్‌-1 పరీక్ష తేదీ (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష): డిసెంబరు, 2022.
టైర్‌-2 పరీక్ష తేదీ: ప్రకటించాల్సి ఉంది.https://ssc.nic.in/


ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2023

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. వివిధ] ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 327 పోస్టులు భర్తీ కానున్నాయి.
విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్‌ చదివి ఉండాలి.
వయసు: 01-01-2023 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్టేజ్‌-1(ప్రిలిమినరీ/ స్టేజ్‌-1) ఎగ్జామ్‌, స్టేజ్‌-2(మెయిన్‌/ స్టేజ్‌-2) ఎగ్జామ్‌, స్టేజ్‌-3(పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2022.
ప్రిలిమినరీ/ స్టేజ్‌-1 పరీక్ష తేదీ: 19-02-2023.
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


ఐటీబీపీలో 52 కానిస్టేబుల్‌ పోస్టులు

కానిస్టేబుల్‌ (యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌) గ్రూప్‌ ‘సి’ నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: 52 (పురుషులు- 44, మహిళలు- 8)
అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన విద్యార్హత  
వయసు: 18- 25 సంవత్సరాలు. దరఖాస్తు రుసుము: రూ.100.
ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2022.
వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in/


ఏపీ భూగర్భ జల, జల గణన శాఖలో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భూగర్భ జల, జల గణన శాఖ ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా 74 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: డిప్లొమా(సివిల్‌ ఇంజినీరింగ్‌)తో పాటు సంబంధిత పని అనుభవం  వయసు: 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత జిల్లాల జిల్లా భూగర్భ జల అధికారులకు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2022. ఇంటర్వ్యూ తేదీ: 11.10.2022.
వేదిక: సంబంధిత జిల్లా భూగర్భ జల, జల గణన శాఖ అధికారి కార్యాలయం.  https://apsgwd.ap.gov.in/jobNotifications


గెయిల్‌లో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

న్యూదిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వర్క్‌-సెంటర్లు/ యూనిట్‌లలో 77 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఏ, బీఎస్సీ, బీకాం, సీఏ, సీఎంఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం  

దరఖాస్తు రుసుము: రూ.200.

ఎంపిక: పోస్టును అనుసరించి రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌,

దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2022.

వెబ్‌సైట్‌: https://gailonline.com/


రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఖాళీలు

హరియాణా రాష్ట్రం గుడ్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన 11 ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.  

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 10.10.2022.
వెబ్‌సైట్‌: https://www.rites.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని