Published : 20 Sep 2022 01:12 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు
ఆసుపత్రుల్లో 66 స్పెషలిస్ట్‌ పోస్టులు

హైదరాబాద్‌ జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 66 సీఏఎస్‌ (స్పెషలిస్ట్‌లు), జీడీఎంవో పోస్టుల భర్తీకి ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

సీఏఎస్‌(స్పెషలిస్ట్‌లు)- ఓ అండ్‌ బి, అనస్తీషియా, పీడియాట్రిక్స్‌, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థో, జీడీఎంవో

అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ, డిప్లొమా, డీఎన్‌బీ.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఎస్‌అండ్‌ఐ) కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 22-09-2022.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/


ప్రవేశాలు
సంస్కృత విశ్వవిద్యాలయంలో యూజీ

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రెగ్యులర్‌ యూజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సీయూఈటీ-2022 అర్హత పొందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.    

1. శాస్త్రి: 616 సీట్లు

2. బీఏ(ఆనర్స్‌): 22 సీట్లు

3. బీఎస్సీ కంప్యూటర్‌: 22 సీట్లు

4. బీఎస్సీ యోగా: 44 సీట్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 10+2/ ఇంటర్మీడియట్‌, డిప్లొమా ఉత్తీర్ణత, సీయూఈటీ-2022 స్కోరు.

వయసు: కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక: సీయూఈటీ-2022 స్కోరు ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 02-10-2022.

వెబ్‌సైట్‌: https://nsktu.ac.in/


ప్రవేశాలు
డా.ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీలో బీఎన్‌వైఎస్‌ కోర్సు

విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో బీఎన్‌వైఎస్‌ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

* బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌(బీఎన్‌వైఎస్‌)

1. కేర్‌ యోగా, నేచురోపతి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, బాపట్ల, గుంటూరు జిల్లా

2. శ్రీ పతంజలి మహర్షి నేచురోపతి అండ్‌ యోగా మెడికల్‌ కాలేజీ, గుంతకల్‌, అనంతపురం జిల్లా

అర్హత: 10+2 (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ), ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణత.

వయసు: 31 డిసెంబర్‌, 2022 నాటికి 17 ఏళ్లు పూర్తయి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.2950 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.2360).

ఎంపిక: ఇంటర్మీడియట్‌ (బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-09-2022.

వెబ్‌సైట్‌: http://drntruhs.in/index.html


జేఎన్‌టీయూలో పార్ట్‌ టైమ్‌ పీజీ

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి కూకట్‌పల్లి క్యాంపస్‌లో కింది విభాగాల్లో పార్ట్‌టైమ్‌ పీజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ప్రతి ప్రోగ్రామ్‌లో 30 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి.

1. ఎంటెక్‌ (ఎలక్ట్రికల్‌ పవర్‌ ఇంజినీరింగ్‌)

2. ఎంటెక్‌ (పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌)

3. ఎంటెక్‌ (ఇంజినీరింగ్‌ డిజైన్‌)

4. ఎంటెక్‌ (ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌)

5. ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)

6. ఎంటెక్‌ (ఇండస్ట్రియల్‌ మెటలర్జీ)

7. ఎంటెక్‌ (బయో టెక్నాలజీ)

8. ఎంటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌)

9. ఎంటెక్‌ (వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజినీరింగ్‌)

10. ఎంటెక్‌ (రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌)

11. ఎంబీఏ (హెచ్‌ఆర్‌/ ఫైనాన్స్‌/ మార్కెటింగ్‌/ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌)

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ అగ్రికల్చర్‌), ఎంఎస్సీ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.2000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2022.

ప్రవేశ పరీక్ష తేదీలు: 15,16, 17.11.2022.

వెబ్‌సైట్‌: https://doa.jntuh.ac.in/


ఎయిమ్స్‌- కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌  

వైద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐఎన్‌ఐ-సెట్‌)-2023 నోటిఫికేషన్‌ను ఎయిమ్స్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎయిమ్స్‌ (న్యూదిల్లీ), జిప్‌మర్‌ (పుదుచ్చేరి), నిమ్‌హాన్స్‌ (బెంగళూరు), పీజీఐఎంఈఆర్‌ (చండీగఢ్‌), ఎస్‌సీటీఐఎంఎస్‌టీ (త్రివేండ్రం)తో పాటు ఎయిమ్స్‌ (భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, నాగ్‌పుర్‌, పట్నా, రాయ్‌పూర్‌, రిషికేశ్‌, బీబీనగర్‌, బతిండా, డియోఘర్‌, మంగళగిరి తదితరాలు)లలో ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, ఎండీఎస్‌ సీట్లు భర్తీ చేయనున్నారు.

అర్హత: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలుంటాయి. మూడు గంటల వ్యవధి ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు, మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)

ప్రాథమిక సమాచార నమోదు, రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 26.09.2022.

పూర్తి దరఖాస్తు సమర్పణ, మార్పులకు అవకాశం: 12.10.2022 నుంచి 25.10.2022 వరకు.

పరీక్ష తేది: 13-11-2022.

వెబ్‌సైట్‌:www.aiimsexams.ac.in/info/  Course.html


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts