నోటిఫికేషన్స్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఒప్పంద ప్రాతిపదికన 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Sep 2022 00:57 IST

ఉద్యోగాలు


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 72 ఖాళీలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఒప్పంద ప్రాతిపదికన 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, డిజిటల్‌ లెండింగ్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌, స్పెషల్‌ అనలిస్ట్‌, బిజినెస్‌ మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ బీసీఏ/ ఎంసీఏ/ సీఏ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 24-45 ఏళ్లు మధ్య ఉండాలి.
అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 3-10 ఏళ్లు పని అనుభవం ఉండాలి. కాంట్రాక్ట్‌ వ్యవధి: 5 సంవత్సరాలు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 11.10.2022
వెబ్‌సైట్‌: https:
//www.bankofbaroda.in/


నిట్‌- పట్నాలో 19 టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

పట్నాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) 19 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌/ బీఎస్సీ/ ఎంసీఏ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌
ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.400
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 01.10.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 03.10.2022
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 10.10.2022
వెబ్‌సైట్‌: 
https://www.nitp.ac.in/jobsnitp/


హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో 55 ఖాళీలు

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌) 55 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ తదితరాలు.
విభాగాలు: టెక్నికల్‌, డిజైన్‌, కమర్షియల్‌, ప్లాంట్‌ మెయింటనెన్స్‌, లీగల్‌, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఎల్‌ఎల్‌బీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ డిప్లొమా/ ఎంసీఏ ఉత్తీర్ణత.
అనుభవం: 2 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35-62 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌డిస్కషన్‌, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.300
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 20.10.2022
వెబ్‌సైట్‌: 
https://www.hslvizag.in/


ఐఐఐటీ నాగ్‌పుర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 7 బోధనేతర ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: పోస్టును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం.
వయసు: టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు 45 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 27 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-10-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 19-10-2022. 

 వెబ్‌సైట్‌: https://iiitn.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని