సీఐఎస్‌ఎఫ్‌ స్వాగతిస్తోంది!

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న 356 పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తుంది.

Published : 26 Sep 2022 00:46 IST

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న 356 పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తుంది. వీటిల్లో ఆటమిక్‌ పవర్‌ప్లాంట్లు, స్పేస్‌ ఇన్‌స్టలేషన్లు, మైన్స్‌, ఆయిల్‌ ఫీల్డ్స్‌ అండ్‌ రిఫైనరీలు, స్టీల్‌ప్లాంట్లు, బ్యారేజీలు, ఫెర్టిలైజర్‌ యూనిట్లు, ఎయిర్‌పోర్టులు, హైడ్రాలిక్‌/థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, కరెన్సీనోట్‌ ప్రెస్‌ లాంటి అతి ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ సంస్థ 540 అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్‌ అర్హతతో మహిళలు, పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు!

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), డాక్యుమెంటేషన్‌, రాత పరీక్ష (ఓఎంఆర్‌ బేస్డ్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)ను ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. స్కిల్‌ టెస్ట్‌లో భాగంగా అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌) అభ్యర్థులకు డిక్టేషన్‌, ట్రాన్స్‌స్క్రిప్షన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) అభ్యర్థులకు టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది.

మొత్తం 540 ఖాళీల్లో.. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టెనోగ్రాఫర్‌) పోస్టులు 122 ఉన్నాయి. వీటిల్లో పురుషులకు 94, మహిళలకు 10, డిపార్ట్‌మెంటల్‌కు 18 కేటాయించారు. హెడ్‌కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) 418 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో పురుషులకు 319, మహిళలకు 36, డిపార్ట్‌మెంటల్‌కు 63 కేటాయించారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా సీనియర్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ (10+2) పాసై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఫిజికల్‌ స్టాండర్డ్స్‌: పురుష అభ్యర్థులు 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ. ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థుల ఎత్తు  162.5 సెం.మీ., మహిళలు 150 సెం.మీ. ఉండాలి. పురుష అభ్యర్థులకు చాతీ 77-82 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ వ్యాకోచించాలి. ఎస్టీ అభ్యర్థులకు 76-81 సెం.మీ. మధ్య ఉండాలి. స్త్రీ, పురుష అభ్యర్థులు ఎత్తుకు తగిన బరువు ఉండాలి.

స్కిల్‌టెస్ట్‌: అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌) అభ్యర్థులు స్కిల్‌టెస్ట్‌లో భాగంగా.. పది నిమిషాలు డిక్టేషన్‌ తీసుకోవాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు రాయగలగాలి. ట్రాన్స్‌స్క్రిప్షన్‌ సమయం ఇంగ్లిష్‌కు 50 నిమిషాలు, హిందీకి 65 నిమిషాలు ఉంటుంది.
* హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) అభ్యర్థులు ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలను, హిందీలో నిమిషానికి 30 పదాలను కంప్యూటర్‌పై టైప్‌ చేయాలి.
రాతపరీక్ష: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపికచేస్తారు. ఇది ఓఎంఆర్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఈ పరీక్షలో నాలుగు విభాగాలు. పార్ట్‌-ఎలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు; పార్ట్‌-బిలో జనరల్‌ నాలెడ్జ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు;  పార్ట్‌-సిలో అరిథ్‌మెటిక్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు. పార్ట్‌-డిలో జనరల్‌ ఇంగ్లిష్‌ లేదా హిందీకి సంబంధించిన 25 ప్రశ్నలకు 25 మార్కులుంటాయి. రాత పరీక్ష ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిచేస్తారు. రాత పరీక్షలో అన్‌రిజర్వ్‌డ్‌/ఈడబ్ల్యూఎస్‌/ఎక్స్‌-సర్వీసెమెన్‌ కేటగిరి అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2022
వెబ్‌సైట్‌: 
www.cisfrectt.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని