నోటిఫికేషన్స్‌

పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన 15 ప్రాజెక్ట్‌ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది

Published : 26 Sep 2022 00:46 IST

ప్రభుత్వ కొలువులు


వీసీఆర్‌సీ, పుదుచ్చేరిలో ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌లు

పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన 15 ప్రాజెక్ట్‌ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-3: 06 పోస్టులు
2. ఫీల్డ్‌ వర్కర్‌: 05 పోస్టులు
3. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-1: 03 పోస్టులు
4. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-బి): 01 పోస్టు
అర్హత: హైస్కూల్‌ విద్యార్హత, 12వ తరగతి (సైన్స్‌ సబ్జెక్టు) ఉత్తీర్ణత, డీఎంఎల్‌టీ, బీఎస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్‌, వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌, మెడికల్‌ కాంప్లెక్స్‌, ఇందిరా నగర్‌, పుదుచ్చేరి చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 26.09.2022.
వెబ్‌సైట్‌: 
https://vcrc.icmr.org.in/


సైట్‌ ఇంజినీర్‌, సీనియర్‌ సైట్‌ ఇంజినీర్‌ పోస్టులు

చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీ సిటీ.. తాత్కాలిక పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సైట్‌ ఇంజినీర్‌/ సీనియర్‌ సైట్‌ ఇంజినీర్‌
అర్హత: బ్యాచిలర్‌/ మాస్టర్స్‌ డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
- ప్రాజెక్ట్‌ మేనేజర్‌/ సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌
అర్హత: బ్యాచిలర్‌/ మాస్టర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 60 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌:
 careers.staff@iiits.in

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, జ్ఞాన్‌ మార్గ్‌, తిరుపతి జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2022.
వెబ్‌సైట్‌:
https://www.iiits.ac.in/


కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 285 కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అర్హత: మాస్టర్‌ డిగ్రీ (జియోలాజికల్‌ సైన్స్‌/ జియాలజీ/ అప్లైడ్‌ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్‌/ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌/ ఇంజినీరింగ్‌ అప్లైడ్‌ జియోఫిజిక్స్‌/ మెరైన్‌ జియోఫిజిక్స్‌/ అప్లైడ్‌ జియోఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ అప్లైడ్‌ కెమిస్ట్రీ/ అనలిటికల్‌ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్‌)- అప్లైడ్‌ జియోఫిజిక్స్‌.
వయసు: 1.1.2023 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక, పరీక్ష విధానం: స్టేజ్‌ 1- కంబైన్డ్‌ జియో-సైంటిస్ట్‌ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌), స్టేజ్‌ 2-కంబైన్డ్‌ జియో-సైంటిస్ట్‌ (మెయిన్‌) ఎగ్జామినేషన్‌ (డిస్క్రిప్టివ్‌ టైప్‌), స్టేజ్‌ 3- పర్సనాలిటీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-10-2022.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 19-02-2023.
మెయిన్‌ పరీక్ష తేదీలు: 24, 25-06-2023
వెబ్‌సైట్‌: 
https://www.upsc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని