Updated : 27 Sep 2022 06:36 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు


ఓఎన్‌జీసీలో 871 గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టులు

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.(ఓఎన్‌జీసీ), దేహ్రాదూన్‌.. గేట్‌ స్కోర్‌-2022తో ఇ-1 స్థాయిలో ఇంజినీరింగ్‌, జియో-సైన్సెస్‌ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ఏఈఈ, కెమిస్ట్‌, జియాలజిస్ట్‌, జియోఫిజిసిస్ట్‌, ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌. విభాగాలు: మెకానికల్‌, పెట్రోలియం, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ప్రొడక్షన్‌.. తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌-2022 స్కోరు ఉండాలి.

వయోపరిమితి: 31.07.2022 నాటికి ఏఈఈ- డ్రిల్లింగ్‌/ సిమెంటింగ్‌ పోస్టులకు 28 ఏళ్లు; మిగిలిన ఖాళీలకు 30 ఏళ్లు మించకూడదు.

వేతనశ్రేణి: రూ.60,000 - రూ.180,000.

ఎంపిక: గేట్‌-2022 స్కోరు, విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా.

దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు).

ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌ చివరి తేది: 12-10-2022.

వెబ్‌సైట్‌: https://ongcindia.com/


బీసీసీఎల్‌లో 41 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ- కోల్‌ ఇండియా లిమిటెడ్‌(సీఐఎల్‌).. భారత్‌ కొకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌)లో పనిచేసేందుకు కింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

1. సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఇ-4)/ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఇ-3): 28 పోస్టులు

స్పెషాలిటీ: సర్జన్‌, జనరల్‌ ఫిజీషియన్‌, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిషియన్‌, సైకియాట్రిస్ట్‌, పాథాలజిస్ట్‌, డెర్మటాలజిస్ట్‌, పల్మనాలజిస్ట్‌/ చెస్ట్‌ స్పెషలిస్ట్‌, ఆప్తాల్మాలజిస్ట్‌, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్‌.

2. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఇ-3): 13 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ, డీఎన్‌బీ, పీజీ డిప్లొమా.

వయోపరిమితి: 31.08.2022 నాటికి ఎస్‌ఎంఎస్‌ పోస్టులకు 42 ఏళ్లు, ఎస్‌ఎంవో ఖాళీలకు 35 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 30.09.2022.

దరఖాస్తులకు చివరి తేదీ: 29.10.2022.

వెబ్‌సైట్‌: https://www.bcclweb.in/


బామర్‌లారీ-కోల్‌కతాలో 40 మేనేజర్‌ ఖాళీలు

బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌, కోల్‌కతా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌.

విభాగాలు: రిటైల్‌ సేల్స్‌, ఇండస్ట్రియల్‌ సేల్స్‌, మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ సర్వీస్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ / పీజీ డిగ్రీ/ ఎంబీఏ/ డిప్లొమా/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

వయసు: 27-40 ఏళ్లు మధ్య ఉండాలి.

పని అనుభవం: కనీసం 01-11 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.2లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ మెరిట్‌తో

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21.10.2022

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com/pages/currentopen-


యూపీఎస్సీ- 52 ఎస్‌ఎఫ్‌ఐవో, వెటర్నరీ ఆఫీసర్లు

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రాసిక్యూటర్‌(సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌): 12 పోస్టులు

2. స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3(జనరల్‌ మెడిసిన్‌): 28 పోస్టులు

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఆయుర్వేదం): 01 పోస్టు

4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(యునాని): 01 పోస్టు

5. వెటర్నరీ ఆఫీసర్‌: 10 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.10.2022.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts