నోటిఫికేషన్స్‌

ఐఐటీ-జోధ్‌పూర్‌లో.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), జోధ్‌పూర్‌ 153 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 28 Sep 2022 06:40 IST

ఉద్యోగాలు

ఐఐటీ-జోధ్‌పూర్‌లో..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), జోధ్‌పూర్‌ 153 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: టెక్నికల్‌ సూపరింటెండెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, హిందీ ఆఫీసర్‌, కౌన్సెలర్‌ తదితరాలు.

విభాగాలు: బయోసైన్స్‌ అండ్‌ బయోఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ ఎల్‌ఎల్‌బీ/ ఎంబీబీఎస్‌/ బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ/ ఎంఏ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎండీ/ ఎంఎస్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి కనీసం 27- 50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000.  

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: 17.10.2022.

వెబ్‌సైట్‌: https://iitj.ac.in/  


జిప్‌మర్‌లో 25 సీనియర్‌ రెసిడెంట్లు

పుదుచ్చేరికి చెందిన జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) 25 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: బయోకెమిస్ట్రీ, జనరల్‌ మెడిసిన్‌, నియోనెటాలజీ, గైనకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, పాథాలజీ, ఫిజియోలజీ, ఫార్మకాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా  

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: 15.10.2022

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in/


బీఈసీఐఎల్‌లో 70 ఉద్యోగాలు

న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్టింగ్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) దిల్లీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పనిచేసేందుకు 70 అసిస్టెంట్‌ గ్రేడ్‌-01, ఎంటీఎస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌ టైపింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: వీడియో కాన్ఫరెన్స్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: DSCSC2022@gmail.com 

దరఖాస్తుకు చివరి తేదీ: 28.09.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/


అసిస్టెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌లు

న్యూదిల్లీలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వివిధ పీఎఫ్‌సీ యూనిట్లలో 22 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* అసిస్టెంట్‌ ఆఫీసర్‌(అడ్మినిస్ట్రేషన్‌)/ ఇ-0: 04 పోస్టులు

* డిప్యూటీ ఆఫీసర్‌(ఎస్టేట్‌ అండ్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌)(సివిల్‌/ ఎలక్ట్రికల్‌)/ ఇ-1: 02 పోస్టులు

* అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌)/ ఇ-3: 01 పోస్టు

* అసిస్టెంట్‌ మేనేజర్‌ (అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌)/ ఇ-3: 01 పోస్టు

* అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌/కమర్షియల్‌) ఇ-3: 07 పోస్టులు

* అసిస్టెంట్‌ మేనేజర్‌ (ప్రాజెక్ట్స్‌) ఇ-3: 07 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2022.

వెబ్‌సైట్‌: https://www.pfcindia.com/Home


వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నైగ్రిమ్స్‌- షిల్లాంగ్‌లో...

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరాగాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నైగ్రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: అనాటమీ, కార్డియాలజీ, సీటీవీఎస్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, రేడియోథెరపీ, యూరాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు  

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీ: 26-29.09.202

ఇంటర్వ్యూ వేదిక: Conference Hall, NEIGRIHMS Guest House, Permanent Campus, Mawdiangdiang, Shillongn793018. 

వెబ్‌సైట్‌: http://neigrihms.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని