అభ్యర్థుల కోసం యూపీఎస్సీ ప్రత్యేక యాప్‌

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల గురించి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో, కచ్చితమైన సమాచారం తెలియజేసేందుకు ఆ సంస్థ ఒక ఆండ్రాయిడ్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. ‘యూపీఎస్సీ అఫిషియల్‌’ పేరుతో గూగుల్‌ ప్లే  స్టోర్‌లో దీన్ని అందుబాటులో ఉంచింది.

Published : 04 Oct 2022 00:59 IST

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల గురించి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో, కచ్చితమైన సమాచారం తెలియజేసేందుకు ఆ సంస్థ ఒక ఆండ్రాయిడ్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. ‘యూపీఎస్సీ అఫిషియల్‌’ పేరుతో గూగుల్‌ ప్లే  స్టోర్‌లో దీన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా సమాచారాన్ని వేగంగా అందించేందుకు దీన్ని సిద్ధం చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. అయితే ఇందులో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదు. సమాచారం తెలిపేందుకు మాత్రమే దీన్ని తయారుచేశారు. అభ్యర్థులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా నేరుగా ప్రతి చిన్న అప్‌డేట్‌నీ సులువుగా తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని