Published : 05 Oct 2022 00:04 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు


ఐఐటీ మండిలో 33 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

హిమాచల్‌ప్రదేశ్‌ మండిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ 33 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* జూనియర్‌ అకౌంటెంట్‌: 8 పోస్టులు * జూనియర్‌ అసిస్టెంట్‌: 25 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ, బీకాం, ఎంకాం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూతో.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఓబీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.300)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28.10.2022.
వెబ్‌సైట్‌: 
https://iitmandi.ac.in/


ఐటీబీపీలో 40 హెడ్‌ కానిస్టేబుళ్లు

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) గ్రూప్‌-సి విభాగంలో 40 హెడ్‌ కానిస్టేబుల్‌ (డ్రెస్సర్‌ వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో పురుషులకు 34, మహిళలకు 6 కేటాయించారు.
అర్హత: పన్నెండో తరగతి. పారా వెటర్నరీ కోర్సు లేదా డిప్లొమా లేదా వెటర్నరీ థెరప్యూటిక్‌/ లైవ్‌స్టాక్‌ సర్టిఫికెట్‌ ఉత్తీర్ణత.
వయసు: 17-11-2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, డీ…టైల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 19.10.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.11.2022.
వెబ్‌సైట్‌:
 https://itbpolice.nic.in/


ఐఎల్‌బీఎస్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌) 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజర్‌, ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌ తదితరాలు.
విభాగాలు: హెపటాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, నెఫ్రాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, ఎపిడమాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఎంబీబీఎస్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ డీఎం/ ఎండీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2022.
వెబ్‌సైట్‌: 
https://www.ilbs.in/?page=hrjobs_listing


అప్రెంటిస్‌

సదరన్‌ రైల్వేలో 3134 ఖాళీలు

సదరన్‌ రైల్వే 3134 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫిట్టర్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఎంఎల్‌టీ, కార్పెంటర్‌, మెషినిస్ట్‌, వైర్‌మెన్‌ తదితరాలు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంధిత స్పెలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.5500-రూ.7000.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్‌ మెరిట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022.
వెబ్‌సైట్‌:
 https://sr.indianrailways.gov.in/


తూర్పు రైల్వేలో 3115 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

కోల్‌కతాలోని తూర్పు రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీˆ) తూర్పు రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో 3115 యాక్ట్‌ అప్రెంటీస్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానికల్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, లైన్‌మ్యాన్‌, వైర్‌మ్యాన్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌ తదితరాలు.
వయసు: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: టెన్త్‌, సంబంధిత ట్రేడులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.
ఎంపిక: మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100. (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు మినహాయించారు).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29/10/2022.
వెబ్‌సైట్‌: 
https://rrcrecruit.co.in/eraprt2223rrc/ gen_ instructions_er.aspx


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts