నోటిఫికేషన్స్‌

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కోర్టు మాస్టర్‌ అండ్‌ పర్సనల్‌ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 10 Oct 2022 00:06 IST

ఉద్యోగాలు

ఏపీ హైకోర్టులో.. 

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కోర్టు మాస్టర్‌ అండ్‌ పర్సనల్‌ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీ(ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌), ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్, హయ్యర్‌ గ్రేడులో ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత.

వయసు: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: షార్ట్‌హ్యాండ్‌ ఇంగ్లిష్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 22.10.2022.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/


సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో.. 

హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ 83 జూనియర్‌ టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత:

1. జూనియర్‌ టెక్నీషియన్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.

2. ఫైర్‌మ్యాన్‌: 10వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.600

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 31.10.2022

https://spphyderabad.spmcil.com/Interface/JobOpenings.aspx?menue=5


ప్రవేశాలు

ఎన్‌ఐఎన్‌లో పీజీ సర్టిఫికెట్‌ 

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పీజీ సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం: 20 సీట్లు అర్హతలు: మాస్టర్స్‌ డిగ్రీ(బయోకెమిస్ట్రీ/ ఫిజియాలజీ/ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ డైటెటిక్స్‌/ బయాలజీ/జువాలజీ/ బయోమెడికల్‌ సైన్సెస్‌) లేదా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ, బీహెఎంఎస్, బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి, బీఫార్మసీ ఉత్తీర్ణత.

వయసు: 50 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్, ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ ట్రైనింగ్, ఎన్‌ఐఎన్, తార్నాక, హైదరాబాద్‌కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 01.11.2022.

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/


జవహర్‌ నవోదయల్లో..

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్లలో 9వ తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులు కోరుతోంది. 

అర్హత: ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు 

వయసు: 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2022.

పరీక్ష తేదీ: 11-02-2023 

https://navodaya.gov.in/nvs/en/Home1


ఇఫ్లూలో పార్ట్‌-టైమ్‌ కోర్సులు

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ 2022-2023 విద్యా సంవత్సరానికి విదేశీ భాషల్లో పార్ట్‌ టైమ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రొఫిషియన్సీ కోర్సు: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్‌.

2. డిప్లొమాలు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, చైనీస్, కొరియన్, పర్షియన్‌.

3. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాలు: అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్, పర్షియన్‌. 

4. డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌: అరబిక్‌

కోర్సు వ్యవధి: రెండు సెమిస్టర్లు. 

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100 ప్రవేశ పరీక్ష రుసుము: రూ.200  

ఎంపిక: రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2022.

వెబ్‌సైట్‌: http://www.efluniversity.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని